Tuesday, October 24, 2023

విరితావి,జ్యోతినా,నీతిదా,మాలినీ,గర్భ,శ్రీలాంచలీ,వృత్తము శ్రీలాంచలీ"- వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.

 విరితావి,జ్యోతినా,నీతిదా,మాలినీ,గర్భ,శ్రీలాంచలీ,వృత్తము

                    శ్రీలాంచలీ"- వృత్తము.

                           రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
                                                      జుత్తాడ.

లామా!లీలయ మాలయా!లలనా లయ శ్రీలీలయా!లలితాలయ
                                                                     సుతాలయా!  
యామా లీలయ మానసా !అలి నీలదా!తామోలగా!యలివేణీ విరి
                                                                       తావియా!   
మామాలంకృత జ్యోత్స్నయా!మాలినీ వరాశ్య శీలయా!మాలికా
                                                          సు మనసా యశా!
కామిదాలను దీర్చుమా!కాలముం సుఖాల నింపుమా!కాలరాత్రి
                                                              శుభదా మనా!

సృజనాత్మక గర్భకవితా శ్రవంతి యందలి అనిరుద్ ఛందము
లోని"-ఉత్కృతి ఛందము.
ప్రాసనియమము కలదు.పాదమునకు26.అక్షరములుండును.
యతులు9,19,యక్షరములకు చెల్లును.

1.గర్భగత"-లీలయా"-వృత్తము.

లామా లీలయ మాలయా!
యామా లీలయ మానసా!
మామాలంకృత జ్యోత్స్నయా!
కామిదాలను గూర్చుమా!

అభిజ్ఞాఛందము నందలిఅత్యష్టి ఛందము నందలిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు 8,అక్షరములుండును.

2.గర్భగత"-ఆలయ"-వృత్తము

లలనాలయ శ్రీ లీలయా!
అలి నీలదా తామోలగా!
మాలినీ వరాస్య శీలయా!
కాలముం సుఖాల నింపుమా!

అభిజ్ఞా ఛందమునందలి బృహతీ ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు 9,అక్షరములుండును.

3,గర్భగత"-లోక్షిప్త"-వృత్తము.

లలితాలయ సుతాలయా!
యలివేణి విరి తావియా!
మాలికా సు మనసా యశా!
కాలధాత్రి శుభదా మనా!

అభిజ్ఞా ఛందము నందలి బృహతీ ఛందము నందలిది
ప్రాస నియమము కలదు.పాదమునకు 9,అక్షరములుండును.

4.గర్భగత"-మానసా"-వృత్తము.

లామా లీలయ మాలయా!లలనా లయ శ్రీ లీలయా!
యామా లీలయ మానసా!అలివేణిదా తామోలగా!
మామాలంకృత జ్యోత్స్నయా!మాలినీ వరాస్య శీలయా!
కామిదాలను దీర్చుమా!కాలముం సుఖాల నింపుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టీఛందము.నందలిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును.
యతి,9,వయక్షరముతో చెల్లును.

5.గర్భగత"-లీలాంచల"-వృత్తము.

లలనాలయ శ్రీ లీలయా!లలితాలయ సుతా లయా!
అలి నీలదా తామోలగా!యలి వేణి విరి తావియా!
మాలినీ వరాస్య శీలయా!మాలికా సు మనసా యశా!
కాలముంసుఖాల నింపుమా!కాల రాత్రి శుభదా మనా!

అణిమా ఛందమునందలి ధృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 18,అక్షరములుండును.
యతి 10,వ యక్షరమునకు చెల్లును.

6.గర్భగత"-పుష్పిణీ"-వృత్తము.

లలితాలయ సుతాలయా!లామా లీలయ మాలయా!
యలివేణి విరి తావియా!యామా లీలయ మానసా!
మాలికా సు మనసా యశా!మామాలంకృత జ్యోత్స్నయా!
కాలరాత్రి శుభదా మనా!కామిదాలను దీర్చుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందమునందలిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-కావుత"-వృత్తము.

లలితాలయ సుతాలయా! లాలనాలయ శ్రీ లీలయా!
యలివేణి విరి తావియా!అలి నీలదా తామోలగా!
మాలికా సు మనసా యశా!మాలినీ వరాస్య శీలయా!
కాల రాత్రి శుభదా మనా!కాలముం సుఖాల నింపుమా!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు 18,అక్షరములుండును.
యతి19,వయక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-లాక్షణీ"-వృత్తము.

లాలనాలయ శ్రీ లీలయా!లామా లీలయ మాలయా!
అలి నీలదా తామోలగా!యామా లీలయ మానసా!
మాలినీ వరాస్య శీలయా!మామా లంకృత జ్యోత్స్నయా!
కాలముం సుఖాల నింపుమా!కామిదాలను దీర్చుమా!

అణిమా ఛందము నందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

8.గర్భగత"-విరితావి"-వృత్తము.

లలనాలయ శ్రీ లీలయా!లలితాలయ సుతాలయా!లామా లీలయ
                                                                           మాలయా!                
అలి నీలదా తామోలగా!యలి వేణి విరి తావియా!యామా లీలయ
                                                                          మానసా!
మాలినీ వరాస్య శీలయా!మాలికా సు మనసా యశా!మామాలంకృత
                                                                  జ్యోత్స్నయా!
కాలముం సుఖాల నింపుమా!కాల రాత్రి శుభదా మనా!కామిదాలను
                                                                    దీర్చుమా!

అనిరుద్ఛందమునందలి ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

9,గర్భగత"-జ్యోత్స్న"-వృత్తము.

లలితాలయ సుతాలయా,లామా లీలయ మాలయా!లలనాలయ శ్రీ
                                                                               లీలయా!
యలివేణి వి18రి తావియా!యామా లీలయ మానసా!అలి నీలదా తా
                                                                             మోలగా!
మాలికా సు మనసా యశా!మామాలంకృత జ్యోత్స్నయా!మాలనీ
                                                                 వరాస్య శీలయా!
కాలరాత్రి శుభధా మనా!కామిదాలను దీర్చుమా!కాలముం సుఖాల
                                                                        నింపుమా!

అనిరుద్ఛందమునందలి ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును.
యతులు,10,18 అక్షరములకు చెల్లును.

10,గర్భగత"-నీలిదా"-వృత్తము.

లలితాలయ సుతాలయా!లాలనాలయ శ్రీలీలయా!లామా లీలయ
                                                                            మాలయా!
యలివేణి విరి తావియా! అలినీలదా తామోలగా!యామా లీలయ
                                                                             మానసా!
మాలికా సు మనసా యశా!మాలినీ వరాస్య శీలయా!మామాలంకృత
                                                                    జ్యోత్స్ననయా!
కాలరాత్రి శుభదా మనా!కాలముం సుఖాల నింపుమా!కామిదాలను
                                                                          దీర్చుమా!

అనిరుద్ ఛందమందలి ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు  26,అక్షరములుండును.
యతులు 10,19,యక్షరములు చెల్లును.

11.గర్భగత"-మాలినీ వృత్తము.

లాలనాలయ శ్రీ లీలయా!లామా లీలయ మాలయా!లలితాలయ సుతా
                                                                                       లయా!
అలి నీలదా తామోలగా!యామా లీలయ మానసా!యలి వేణి విరి
                                                                                 తావియా!
మాలినీ వరాస్య శీలయా!మామాలంకృత జ్యోత్స్నయా!మాలికా సు
                                                                         మనసా యశా!
కాలముం సుఖాల నింపుమా!కామిదాలను దీర్చుమా!కాలరాత్రి శుభ దా
                                                                                   మనా!

Monday, October 23, 2023

లాక్షణ్యధీ,లోక్షిప్త,రత్నాకరీ,లోలాంచలీ,లాలయా,,గర్భ శ్రీరంగధీ వృత్తము శ్రీరంగధీ వృత్తము. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.

లాక్షణ్యధీ,లోక్షిప్త,రత్నాకరీ,లోలాంచలీ,లాలయా,,గర్భ శ్రీరంగధీ వృత్తము శ్రీరంగధీ వృత్తము.  

రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.

లాలీ లాలలయోల శ్రీ  లాలాంబుధీ లోలయా ప్రియా లక్ష్మీమానసా వాసయా!
లాలీ లోల లయానుకరీ!లాలీలయా లోలతా లతా!లాక్షణ్యాంబుధీ సోమకా!
లోలా లాలిత పుష్పగళీ!లోలాంచలా ఘ్రాణ నాసికా!లోక్షిప్తార్ద్ర రత్నాంకరీ!
లాలయామసి లాక్షణ్యధీ!లాలించి కాపాడవే రమా!లాక్షణ్య సు శ్రీలాంచలీ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందమందలి
ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.యతులు10,18,యక్షరములు.
పాదమునకు 26.అక్షరములుండును.

1.గర్భగత"-లాలీల"-వృత్తము

లాలీలాల లయోలయశ్రీ!
లాలీ లోల లయాను కరీ!
లోలా లాలిత పుష్ప గళీ!
లాలయామసి లాక్షణ్యధీ!

అభిజ్ఞా ఛందాంతర్గత బృహతీ ఛందము నందలిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు 9,అక్షరములుండును.

2.గర్భగత"-లాలాంబుధీ"-వృత్తము.

లాలాంబుధీ లోలయా ప్రియా!
లాలీలోలయా లోలతా లతా!
లోలాంచలాఘ్రాణ నాసికా!
లాలించి కాపాడవే!రమా!

అభిజ్ఞా ఛందాంతర్గత"-బృహతీఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 9,అక్షరములుండును.

3.గర్భగత"-మానసా"-వృత్తము.

లక్ష్మీ మానసా వాసయా!
లాక్షణ్యాంబుధీ సోమకా!
లోక్షిప్తార్ద్ర రతానాంకురీ!
లాక్షణ్యా సు శ్రీ లాంచలా!

అభిజ్ఞా ఛందాంతర్గత"-అను ష్టుప్ ఛందమందలిధి
ప్రాసనియమము కలదు.పాదమునకు 8 అక్షరములుండును

4.గర్భగత"-లోలయా"-వృత్తము.

లాలీలాల లయోలయ శ్రి!లాలాంబుధీ లోలయా ప్రియా!
లాలీ లోల లయాను కరీ!లాలీలయా లోలతా!లతా!
లోలా లాలిత పుష్ప గళీ!లోలాంచలా ఘ్రాణ నాసికా!
లాలయామసి లాక్షణ్యధీ!లాలించి కాపాడవే!రమా!

అణిమా ఛందాంతర్గత"-ధృతి ఛందమందలిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు 18,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

5.గర్భగత"-లోలతా"-వృత్తము.

లాలాంబుధీ లోలయా ప్రియా!లక్ష్మీ మాన సావాసయా!
లాలీయా!  లోలతా లతా!లాక్షణ్యాంబుధీ సోమకా!
లోలాంచ లాఘ్రాణ నాసికా!లోక్షి ప్తార్ద్ర రత్నాంకురీ!
లాలించి కాపాడవే!రమా!లాక్షణ్యా సు శ్రీలాంచలీ!

అణిమా ఛందాంతర్గత అత్యష్టి"-ఛందమందలిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు 17,అక్షరములుండును.
యతి10,వయక్షరమునకు చెల్లును.

6.గర్భగత"-వాతపా"-వృత్తము.

లక్ష్మీ మానసా వాసయా!లాలీలాల లయోలయశ్రీ!
లాక్షణ్యాంబుధీ సోమకా!లాలీ లోల లయాను కరీ!
లోక్షిప్తార్ద్ర  రత్నాంకురీ! లోలా లాలిత పుష్ప గళీ!
లాక్షణ్యాంసు శ్రీలాంచలీ!లాలయామసి లాక్షణ్యధీ!

అణిమా ఛందాంతర్గత"-అత్యష్టీఛందము నందలిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు 17,అక్షరములుండును.
యతి 9 వయక్షరమునకు చెల్లును.

7.గర్భగత"-పుష్పకా"-వృత్తము.

లక్మీ మానసా వాసయా!లాలాంబుధీ లోలయా ప్రియా!
లాక్షణ్యాంబధీ సోమకా!లాలీలయా లోలతా లతా!
లోక్షి ప్తార్ద్ర రత్నాంకురీ!లోలాంచలాఘ్రాణ!నాసికా!
లాక్షణ్యాంసు శ్రీలాంచలీ!లాలించి కాపాడవే!రమా!

అణిమా ఛందాంతర్గత"'-అత్యష్టీ ఛందమందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 17,అక్షరములుండును.
యతి 9 వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-లాక్షణ్యధీ"-వృత్తము

లాలాంబుధీ లోలయా ప్రియా!లాలీ లోలలయోలయ శ్రీ!
లాలీ ల యా లోలతా లతా!లాలీ లోల లయాను కరీ!
!లోలాంచ లాఘ్రాణ నాసికా!లోలా లాలిత పుష్ప గళీ!
లాలించి కాపాడవే!రమా!లాలయా మసి లాక్షణ్యధీ!

అజిమా ఛందాంతర్గత"-ధృతి ఛందమంథలిది
ప్రాసియమము కలదు.పాదమునకు 18,అక్షరము లుండును.
యతి10,వయక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-లోక్షిప్త"-వృత్తము.

లాలీలాంబుధి లోలయా ప్రియా!  లక్ష్మీ మానసావాసయా!లాలీలాల
                                                                         లయోలయశ్రీ!
లాలీలయా లోలతా లతా!లాక్షణ్యాంబుధీ సోమకా!లాలీ లోల లయానుకరీ!
లోలాంచ లాఘ్రాణ నాసికా!లోక్షి ప్తార్ద్ర రత్నాంకురీ!లోలా లాలిత పుష్ప గళీ!
లాలించి కాపాడవే!రమా!లాక్షీలాం సు శ్రీలాంచలీ!లాలయామసి లాక్షణ్యధీ!

అనిరుద్ ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరములుండును.
యతులు10,19 అక్షరములకు చెల్లును.

10,గర్భగత"-రత్నాకరీ"-వృత్తము.

లక్ష్మీ మానసా వాసయా!లాలీలాల లయోలయ శ్రీ!లాలాంబుధీ లోలయా!
                                                                                         ప్రియా!
లాక్షణ్యాంబుధీ సోమకా!లాలీలోల లయాను కరీ!లాలీలయా లోలతా!లతా!
లోక్షిప్తార్ద్ర రత్నాంకురీ!లోలా లాలిత పుష్పగళీ!  లోలాంచలా ఘ్రాణ నాసికా!
లాక్షణ్యాం సు శ్రీలాంచలీ!లాలయామసి లాక్షణ్యధీ!లాలించి కాపాడవే!రమా!

అనిరుద్ ఛందాంతర్గత"-ఉత్కృతి ఛందమునందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరములుండును.
యతులు9,18 అక్షరములకు చెల్లును.

11.గర్భగత"-లోలాంచలీ"-వృత్తము.

లక్ష్మీ మానసా వాసయా!లాలాంబుధీ లోలయా!ప్రియా!లాలీలాల లయో
                                                                                         లయశ్రీ!
లాక్షణ్యాంబుధీ సోమకా!లాలీలయా!లోలతా లతా! లాలీలోల లయానుకరీ!
లోక్షిప్తార్ద్ర రత్నాంకురీ!లోలాంచలాఘ్రాణ నాసికా!లోలా లాలిత పుష్ప గళీ!
లాక్షణ్యాసుశ్రీలాంచలీ!లాలించి కాపాడవే!రమా!లాలయామసి లాక్షణ్యధీ!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి ఛందము నందలిది.
ప్రాస నియమము కలదు .పాదమును 26.అక్షరములుండును.
యతులు; 9,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-లాలయా"-వృత్తము.

లాలాంబుధీ లోలయా ప్రియా!లాలీలాల లయోలయ శ్రీ!లక్ష్మీ మానసా
                                                                                  వాసయా!
లాలీ లయా లోలతా లతా!లాలీలోల లయాను కరీ!లాక్షణ్యాంబుధీ సోమకా!
లోలాంచలాఘ్రాణ నాసికా!లోలా లాలిత పుష్ప గళీ!లోక్షిప్తార్ద్ర రత్నాంకురీ!
లాలించి కాపాడవే!రమా!లాలయామసి లాక్షణ్యధీ!లాక్షిణ్యా సు శ్రీలాంచలీ!

అనిరుద్ ఛందాంతర్గత ఉత్కృతి ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు. పాదమునకు26,అక్షరములుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Thursday, September 14, 2023

ప ద్య మే ప్ర చం డా స్త్రం! బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

జైశ్రీరామ్.

 ప ద్య మే ప్ర చం డా స్త్రం!

బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

 నాడు ఉద్దండ కవులకు పద్యమే ప్రచండాస్త్రంగా మారడం విడ్డూరం!

వేములవాడ భీమకవికైతే చెప్పనేయక్కరలేదు.అలాంటి పద్యాలు

రసనాగ్రంమీద నర్తన చేస్తాయి.

"ఆఱింటను త బెట్టిన వారింటను పీనుగెళ్ళు వసుమతిలోనన్"-

అనే దొకటి ప్రజానీకంలో నాడు ప్రచారంలో ఉండేది.

ఆఱవ అక్షరంగా  త కారమునుపయోగించి యెవరిపైనా 

పద్యంచెప్పరాదని దానిభావం.ఒకవేళచెపితేనో? ఎవరనిగూర్చి 

పద్యంచెప్పబడిందో ఆవ్సక్తి హరీ మన్నట్టే! వాడికీలోకంలో నూకలుతీరినట్లే.

అలాగజరిగినకథలున్నాయా?అంటే, ఉన్నాయంటున్నారు.

అందులో ఒకకథ మనమిప్పుడు విందాం.

            ఆకథానాయకుడు మనఉద్దండకవి వేములవాడ భీమనయే! 

నాటికవులలో కొందరు సంచారశీలురు.వారు సపరివారంగా తిరుగుతూ 

రాజాస్థానములకేగి ప్రభువులను రంజించి విత్తమార్జించేవారు.

వారిపరివారంలో భార్యాపిల్లలు సేవకులేగాక,వారియుంపుడు 

గత్తెలుగూడా వెంటరావడం నాటిముఖ్యవిశేషం.

            భీమకవి సపరివారుడై పర్యటనచేస్తూ,తూర్పుగోదావరిలోని,

"గుడిమెట్టలంక"కువిచ్చేసెనట.దానికొకమాండలిక ప్రభువు ఏలిక.

అతనిపేరు "పోతరాజు"-

            భీమకవి గ్రామసమీపమునగల సత్రమునందు బసచేసి 

తమరాకను ప్రభువునకు తెలియజేసెను.కానీ ఆప్రభువునకు 

కవిత్వముపై నాశక్తిలేకపోగా ,కవులను చిన్నచూపుచూచెడువాడు. 

పోతరాజు భీమకవినాహ్వానింపలేదు.అందుకు కవి మిగులవగచి 

తనవాహనమైన( ఆడ)గుఱ్ఱమునెక్కి కోటలోనికి బోయిప్రభువును 

దర్శించెనట.

పోతరాజుకు బలిసిన భీమకవి గుఱ్ఱముమీద కన్నుబడినది.

ఎలాగైనా దాన్ని అపహరించాలనుకున్నాడు."నీకవిత్వం 

వినటానికి మాకిప్పుడు సమయంలేదు.కవిత్వంమాట అటుంచు,

నీగుర్రంబాగుంది.అయినా ఊరూరాతిరిగిబిచ్చమెత్తే నీకు 

గుర్రమెందుకు?దానినిమాకమ్మై యెంతసొమ్ముకావాలో అడగమన్నాడు.

దానినమ్మనన్నాడుభీమకవి.అయితే మాకోటలోకి మాఅనుమతిలేనిదే 

వచ్చిన ఈగుఱ్ఱాన్ని మేంజప్తుచేశాం.

ఇకమెదలకుండా పొమ్మన్నాడు."

భీమకవి రగిలిపోయాడు. వెంటనే వాగ్బాణాన్ని పోతరాజుపై సంధించాడు.

"హయమది సీత పోతవసుధాధిపు డారయ రావణండు, ని

శ్చయముగ నేను రాఘవుడ, సహ్యజవారిధి, మారుడంజనా

ప్రియతనయుండు, లచ్చన విభీషణు,డా

గుడిమెట్టలంక, నా

జయమును, పోతరక్కసుని చావును, నేడవనాడు జూడుడీ!!

--అంటూ పోతరాజును శపించాడట!

పద్యంమొదటిపాదంలో 6వ అక్షరం త కారం అయింది .

ముందు దానిని గమనించండి.

పద్యభావం:-

     నాగుఱ్ఱమేమో సీత.పోతరాజుగారేమొ రావణాసురుడు.

నేను రాముడను. గోదావరే సముద్రం,మారయ్యే(గుర్రంబాగోగులుచూసే

సేవకుడు)ఆంజనేయుడు కాగా నేడురోజులలో నాశాపము ఫలించి 

యీపోతరాజు మరణించునుగాక!

నాహయముమరలనాకుదక్కునుగాక!

యనిశపించెనట. పోతరాజుమీసములు సవరింప.భీమన సత్రమునకు 

పయనించెనట.

     ఇది జరిగిన సరిగ్గా వారంరోజులకు కోటలోనుండి హాహాకారములు

".అయ్యయ్యో! పోతరాజు అకారణముగా మరణించినాడు.రోగమూలేదు,రొచ్చూలేదు".ఇదేమివిచిత్రమని,లోకులు 

వాపోవుచుండగా.వారిలో తెలివిగల సచివులకు భీమకవి శాపము 

గుర్తుకు వచ్చింది.వెంటనేవారు ఆలస్యంచేయకుండా

సత్రానికి వెళ్ళి భీమకవి పాదాలపైబడి క్షమించండని ప్రార్ధించారట.

అంతఃపురకాంతల రోదనలు విని మనసుకరగి భీమకవివారికి 

అభయమొసంగినాడట.

భీమకవి దయాళుడై శవప్రాయుడై పడియున్న పోతరాజు సమీపించి ,

అందరు వినుచుండగా,

"నాటి రఘురాము తమ్ముడు

బాటిగ సంజీవిచేత బ్రతికిన భంగిన్,

గాటికిఁబోనేటికిరా?

లేటవరపు బోతరాజ! లెమ్మా!రమ్మా!

-అని శాపోప శమనము పలికినాడట!.

 కలగన్నరీతి పోతరాజు లేచి,సచివులవలన జరిగింది తెలిసికొని,

కవిపాదములకు నమస్కరించి,గుఱ్ఱమును సవినయంగా 

సమర్పించుటేగాక,యధోచితంగా కవిని సత్కరించి పంపెనట!

యువకవులారా!ఇట్టి ఛందోరహస్యములను పెద్దలవలన తెలిసికొని 

పద్యములను వ్రాయుడు.లేకున్న లోకమునకు ప్రమాదము.

తెలిసికొని వ్రాసిన లోకమునకు ప్రమోదము.

స్వస్తి!

జైహింద్.

Thursday, August 24, 2023

భక్తిసాధనం ప్రవచన యజ్ఞం.

 *శ్రీ మన్మమహాభారత ప్రవచన యజ్ఞం*


ఆది 
సభా
అరణ్య
విరాట
ఉద్యోగ
భీష్మ
ద్రోణ
కర్ణ
శల్య
సౌప్తిక
స్త్రీ
శాంతి
అనుశాసన
అశ్వమేధ
ఆశ్రమవాస
మౌసల
మహాప్రస్థాన & స్వర్గారోహణ

అపురూప అవధాన కళను కాపాడుకుందాం ..... శ్రీ ఎ న్సీహెచ్ చక్రవర్తి.


 "గురువుగారూ!మీరు అవధానంచెయ్యాలి"
"చెయ్యను"
"మాకోసం చెయ్యాలి"
"మీకోసమూ చెయ్యను"
"ఎందుకు చెయ్యరు?"
"నాకా శక్తీ అర్హతా లేవు"
"మీరు ఆశువుగా పద్యాలు చెప్తారు. ఎందుకు చెయ్యకూడదు?"
అవధానం అంటే ఒక్క ఆశుకవిత్వం చెప్పడమే కాదు. ఇంకా కొన్ని ఉండాలి"
"ఏమిటి అవి?"
"సమయస్ఫూర్తి, శాస్త్రపరిజ్ఞానం, ధారణాశక్తి మొదలైనవి అన్నీ ఉండాలి. అంతేకానీ  ఆశుకవిత్వం చెప్పగల్గడo ఒక్కటే కాదు. "
"మీకు అవన్నీ వచ్చండీ. కూర్చోండి. మేము చేయిస్తాం"
"మీరు చేయిస్తారు అన్నదే భయం. నేను చెయ్యాలికదా!!"😃😃
'మరో విషయం చెప్పనా?"
"చెప్పండి!"
"కచ్చితంగా చెప్తే ఒక్కచోట పద్యం తప్పినా ధారణ తప్పినా మొత్తం అవధానం పోయినట్లే!తెలుసా??
అందుకే అవధానం చేసే దమ్మూ,ధైర్యం,ప్రతిభా పాటవాలు నాకు లేవు. " ఇదీ అవధానాలు చూస్తూ కొన్నిసార్లు మా శిష్యులకూ నాకూ జరిగిన యథాతథ సంభాషణ. వారికి ఒక్కటి స్పష్టంగా చెప్పాను. 8 మంది పండితులను challenge చేసి కూర్చోడమే పెద్ద సాహసo.అంత సాహసం నాకు లేదు. అందుకే అంత సాహసాన్ని సంతరించుకున్న అవధానులకూ వారిని తీర్చిదిద్దే శిక్షకులకూ ముందుగా వందనాలు సమర్పిస్తాను.
  తెలుగుభాషకే వన్నె తెచ్చిన సాహిత్యప్రక్రియ అవధానం. ఇది కళ అంటే కళ. విద్య అంటే విద్య. 
ఏ అంశానికి ఆ అంశమే గొప్పది అందులో. ఎందుకంటే అవధాన పద్యం నీరసం కాకుండా రసవంతంగా ఉండేటట్లు అవధానం రసవత్తరంగా సాగేటట్లు   సరసులను అలరించవలసిన బృహత్తర బాధ్యత ప్రధానంగా అవధానిదీ ఆ పిదప ప్రాశ్నికులదీ. 
ఈ కళ(విద్య) కొన్ని తరాలపాటు రసికులను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఎడనెడ అలరిస్తూనే ఉంది. ఈ కళలో పంటలు పండించారు ఎందరో మహానుభావులు. అవధాన చరిత్రలో శాశ్వతస్థానాన్ని సంపాదించినవారు. 
  ఈ అవధానానికి ఒక ప్రమాణ విధానం ఉన్నది. ఒకటి రెండు అంశాలు కొందరు మార్చుకున్నా విధానంలో మార్పు ఉండదు. పూర్వులు ఆ సంప్రదాయాన్ని సుస్థిరం చేసి పెట్టారు--సంగీతకచేరీ లాగానే!! ఆ విధానాలు నేను ప్రత్యేకంగా వివరించనవసరం లేదని భావిస్తాను. 
  అయితే ఇటీవల చూస్తున్న అవధానాల గురించి చెప్పుకోవలసి ఉన్నది. పూర్వం ఆంతటి ఓపిక ఇప్పుడు శ్రోతలకు లేదు. త్వరగా ముగియాలి. రెండు లేక రెండున్నర గంటలు అంటే ఎక్కువే!!పూర్తిగా మూడు గంటలూ కూర్చుని చూసేవారు వ్రేళ్ళసంఖ్యలో ఉంటారు. ఇది అందరికీ అనుభవమే! సమయపాలన చెయ్యకపోడం వల్ల కొంత కాలహరణం జరుగుతున్నది. ఆ పిదప కాల ప్రణాళిక లేకుండడం వల్ల నెమ్మదిగా యథావిథిగా కార్యక్రమం నడుపుతూ ఉండడం వల్ల అవధానం గంటన్నర రెండుగంటల లోపు ముగించాలి. అంటే రెండు ఆవృత్తులు కాగానే 3,4 ఆవృత్తులు ఒకేమారు పూర్తిచేయిస్తున్నారు.అందరూ అంతే!! ఇది సంప్రదాయ భిన్నంగా నడుస్తున్న క్రొత్తపోకడ. ప్రొసీడింగ్స్ కి కాలవ్యవధి తగ్గించుకుని అవధానానికే పూర్తిగా సమయం కేటాయించాలి అనే ఒక స్పృహ లోపిస్తున్నది అనిపిస్తున్నది. నిషిద్ధం 2 పాదాలకూ కుదించుకుపోడం చూస్తున్నాం. అలాగే ఆశువులు రెండు లేక మూడు. ఇలాగే అన్నీ కుదింపు. 
సాధారణంగా అవధాన పద్యాలు కొంత నీరసం గా ఉంటాయి అనే ఒక ప్రథ ఉన్నది. అందులో రసమూ అలంకారమూ వంటివాటికి (ఉంటే ఉండవచ్చు ఎక్కడైనా) పెద్ద ప్రాధాన్యం ఉండదు. అంశాలను ఝటితి స్పూర్తితో చమక్కులతో పూర్తి చేసారా అన్నదే ముఖ్యం అక్కడ. ఇటువంటి అవధానాలలో ఇటీవల వాసి తగ్గింది అనేది వాస్తవం. పైకి చెప్పడానికి సంకోచించినా అంతర్గతoగా అందరూ అనుకునేది.
  ఇది ప్రత్యక్షoగా చూసే/వినే వారికి ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. *ప్రత్యక్షానుభూతి* దీనికి ప్రధాన కారణం.
  కాలం మారింది. ఎక్కువమంది ఇప్పుడు అవధానాలు చేస్తున్నారు. పూర్వంలాగా పద్యాలలో పటుత్వం తగ్గింది. పూర్వులలాగా అంతటి శాస్త్రపరిజ్ఞానం అందరికి ఉండడం లేదు. కొందరి విషయంలో ఎంతోకొంత ఆశువుగా పద్యం చెప్పడమూ నిషిద్ధాక్షరి టెక్నిక్స్ తెలుసుకుంటే చాలు అన్నట్టుగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. గతంలో అప్రస్తుతప్రసంగాలు బాగా సాగేవి. అవధానుల జవాబులూ బాగా ఉండి రంజింపచేసేవి. ఇప్ప్పుడు అంతగా రంజింపచెయ్యడం లేదు అని చెప్పుకోవాలి. అవధానులూ నూటికి నూరు చమత్కారంగా చెప్పడం లేదు. కొందరు ఒక condition పెడుతున్నారు. పాదo అల్లుతూ మధ్యలో ఉండగా అప్రస్తుతం చేయరాదని. పూర్వం ఈ నియమం లేదు. ఇవి ఆధునికంగా వచ్చిన మార్పులు.
ధారణ సమయంలో సంచాలకులు ప్రక్కనుండి కొంత అందించడం మనం చూస్తున్నాం. ఇవి అన్నీ లోపాలు ఎంచడం కాదు.  సమీక్షించడమే!!
  ఇప్పుడు కరోనా పుణ్యమా అని వాట్సాప్ వేదికగా అవధానాలు జరుగుతున్నాయి. ప్రాశ్నికులూ అవధాని టైప్ చెయ్యడం ద్వారా ఇది జరుగుతుంది.  వీటి గురించి చర్చ జరగవలసి ఉన్నది. ప్రత్యక్ష అనుభూతి లేకపోడం ఒకలోపం కాగా నేను చూసిన చాలా అవధానాలు రoజకంగా జరగలేదు. ఒకరిద్దరు మినహాయింపు. ప్రత్యక్షంగా లేనప్పుడు అసలు అవధాని ఒక్కరే అవతల ఉండి పద్యం చెప్తున్నారు అనే విశ్వాసంతో నడిచేది.(కనపడ నంతవరకూ)ఇందులోనూ సంచాలకులు ఎక్కువ పాత్ర పోషించడం గమనించాము. అప్రస్తుతం అనే అంశం ఇందులో అనవసరం అని నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి ప్రత్యక్ష స్పర్శ లేదు కనుక వ్యవధి తొందర లేదు. రెండుగంటల్లో ముగించాలి అనిలేదు. చూచేవాళ్ళు చూస్తూనే ఉంటారు కనుక వ్యవధి పెరిగినా ఇబ్బందిలేదు. ఎదురుగా చూసేటప్పుడు ప్రేక్షకులు పల్చబడితే నిరుత్సాహం కలగవచ్చు. కానీ ఇందులో ఆ ఇబ్బంది లేదు. కానీ అన్ని అవధానాల్లోనూ రెండుఆవృత్తులు కాగానే 3,4 పూర్తి చేయించేస్తున్నారు. సంప్రదాయాన్ని తప్పి ఇలాగ అక్కరలేదేమో అనిపిస్తుంది. అప్రస్తుతం అంశాన్ని తొలగిస్తే లోటూ ఉండదు. నిజానికి దీనిలో ధారణ అన్నదీ అర్థరహితమే(ప్రత్యక్షం కానప్పుడు)
కనుక ఈ విషయాలను ఆలోచించ వలసిఉన్నది. 
 అంతమాత్రం చేత అవధానుల శక్తి సామర్ధ్యాలను శంకించడం కాదు. ముందే చెప్పాను సాహసం చెయ్యగల్గినవారే అవధానులు అవుతారు అని. కాకపోతే ఇందులో ఉన్న సాధకబాధకాలను గురించి మాత్రమే సమీక్ష-అందునా క్రొత్త ప్రయోగం కనుక. 
  విజ్ఞులూ అవధానులూ అందరూ కలసి ఈ వాట్సాప్ అవధానాల విధివిధానాలు నిర్ణయించవలసి ఉన్నది. దీని రంజకత్వానికి కృషిచెయ్యవలసి ఉన్నది.
  
ఒక మిత్రులు ఇటీవల నాతో ఒక చర్చ చేసారు. దానిసారాంశం ఏమంటే అవధానం అనేది ఒక నాటకం అనీ మొత్తంపై ప్రాశ్నికులు అందరూ కలిసి అవధానిని గెలిపించి హైలైట్ చెయ్యడానికి సాగే ఒక తతంగం అనీ!! ఇదే అభిప్రాయం చాలామందిలో ఉందని. దీనితో కొంతవరకూ నేను విభేదించినా ఆధునికంగా ఇది కొంత నిజమా అన్నట్లుగా జరుగుతున్నది. ఎందుకంటే ఆధునికుల పద్యాల్లో దోషాలు బాగానేదొర్లుతున్నాయి.యథాప్రకారంఅందరూఅవధానినిఎత్తికుదేస్తూ ప్రశంసలు గుప్పించేస్తున్నారు. పొగడకపోతే తగ్గిపోతాం అన్న ధోరణే అంతటా కనిపిస్తున్నది. గుణ దోష చర్చ ఎక్కడా లేదు. ఇందువల్ల అవధాన ప్రక్రియ మున్ముందు కవిత్వంతోపాటు పల్చబడుతుందా అనే ఆశoక కలుగుతున్నది. అవధాన విద్య సౌరభాలు చెడకుండా ఎలా కాపాడుకోవాలి అన్నది పరిశీలన జరగాలి.
  కేవలం ఆహ్లాదకరమైన చర్చజరిగి తెలుగు అవధాన ప్రక్రియకు పూర్వవైభవాన్నిసంతరింపచెయ్యాలిఅన్నదేలక్ష్యంకావాలి.రాగద్వేషాలకు అతీతంగా ఇది సాగాలి. నా అనుభవాల ఆధారంగా నేను చెప్పిన అంశాలకు ఎవరి అనుభవాలు వారివిగా జోడించి చెప్పుకోవచ్చు.
   ఇప్పటికీ చాలా రoజకంగా అవధానాలు చేస్తూ ఆ కళకే జీవితాన్ని అంకితం చేసినవారు మన కాలంలోనూ ఉన్నారు. అవధానులను తయారుచేస్తున్న శిక్షకులూ ఉన్నారు. కొందరిపేర్లు చెప్పి కొందరిని మరిస్తే అపచారం అవుతుందని ప్రస్తావన చెయ్యడం లేదు.వారందరి కళా నైపుణ్యాలకూ మనం ప్రణమిల్లుతూ ఆ కళ ఆధునిక కాలంలో రసహీనం కాకుండా చూసుకోవాలి.  అవధాన సంపూర్ణత్వాన్ని కాపాడుకునేందుకు ప్రస్తుతం ఉన్న అవధానులు కృషిచెయ్యాలి.
  కేవలం అవధానవిద్యనూ పద్యవిద్యనూ ఆస్వాదించే అభిమానిగా మాత్రమే ఈ చర్చ చేసాను. అదే నాకున్న అర్హత.

*N. CH. చక్రవర్తి.*

Wednesday, August 23, 2023

 శ్లో౹౹ అవశ్య మనుభోక్తవ్యం  కృతం కర్మ శుభాశుభమ్।

కృతకర్మక్షయో నాస్తి కల్పకోటిశతైరపి॥

ఆ.వె.  అనుభవింప వలయు నశుభ,శుభఫలము

లాచరించు కర్మ మోచనకును,

కల్పశతముకోటి గడచిపోయినకాని

యనుభవింపవలయునట్టికర్మ.

భావము:- చేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించవలసినదే. 

వంద కోట్లకల్పాలకు కూడా చేసిన కర్మ అనుభవించకుండా క్షీణించదు.

చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం

 చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*


భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా

*చదివే సమయంలో పెదవులు తగలనిది*
శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*
*అంటే పెదవి తగలనిది, తగిలేది*
దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

*కేవలం నాలుక కదిలేది*
సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా                                                                                                                                        
*నాలుక కదలని (తగలని) పద్యాలు*
కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

*నాలుక కదిలీ కదలని పద్యం*
ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా  

🙏  *పద్య భాషాభిమానులకు జోహార్లు*.
*తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు*  🙏 
*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని*

Lalitha Sahasra Namalu - 18 | Chintha Ramakrishna Rao | Kumara Suryanara...

Lord Shiva Telugu Devotional Song | Susheela Devi | Chintha Ramakrishna ...

Lalitha Sahasra Namalu - 16 | Chintha Ramakrishna Rao | Kumara Suryanara...

Lalitha Sahasra Namalu - 18 | Chintha Ramakrishna Rao | Kumara Suryanara...

Monday, August 21, 2023

శ్రీలలితా సహస్రములోని 697వ నామము. గానము .. శ్రీ కుమార సూర్యనారాయణ.

 

జైశ్రీరామ్.

697. ఓం సర్వలోకవశంకర్యై నమః. .

నామ వివరణ.

సర్వ లోకములను వశము చేసుకొనిన తల్లి మన అమ్మ.

తే.గీఅమ్మ! నీ పాద సంసేవనమ్ము సేయ

నాత్మ నీవశమై యుండునమ్మ సతము,

ధర్మ సమ్మత జీవనంబర్మిలినిడు

*సర్వ లోక వశంకరీ*! శరణు శరణు.

జైహింద్.

జగన్మాతకు వందనములు.

జైశ్రీరామ్

నా అర్థాంగి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విజయలక్ష్మి

అమ్మవారి కృపచే నాకు లభించిన వరప్రసాదము.

ఉ.  మాయని మందహాస ముఖి. మాటలు నేర్వని మౌనభాషి. నా

శ్రేయమె కోరు నెల్లపుడు చిత్రముగా నిరతంబు కాచు నన్.

ధీయుత. మార్గదర్శి  కులదేవతపోలి రహించునింటిలో.

నీ యమ నాకు భార్యగ మహేశ్వరి పంపుటఁజేసి వచ్చెనే.

ఈ సుశీల ఆయురారోగ్య ఆనంద సౌభాగ్యాలతో 

నాకు తోడుగా సంతోషంతో ఉండవలెనని 

ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు లభించవలెనని కోరుకొంటూ

జగన్మాతకు ప్రణమిల్లుచుంటిని.

జైహింద్.

శ్రీ లలితా సహస్ర నామముల్లో ఆరువందల తొంబది ఆరవ నామము. గానము .. శ్రీకుమార సూర్యనారాయణ. Lalitha Sahasra Namalu - 6 | Chintha Ramakrishna Rao | Kumara Suryanaray...

జైశ్రీరామ్.

696. ఓం దైత్య శమన్యై నమః

నామ వివరణ.

దైత్యులను నశింపఁజేయు తల్లి మన అమ్మ.

చంకరుణను సద్గుణంబులను గావుము నా యెడనుండి నీవు, నా

పరువును దీయు దుర్గుణ మవారిత రీతి నశింపఁ జేయుమా.

సురుచిర భావ సంపదను శోభిలునట్టుల నన్ను జేయుమా,,

నిరుపమవైన *దైత్య శమనీ*! నినుఁ గొల్చెద నమ్మ, భక్తితోన్. 

జైహింద్.

లలితాశ్రీచంద్రమౌళీశ్వరా! శ్తకమున 6వ పద్యము. గానం... బ్రహ్మశ్రీ ఏల్చూరి రామబ్రహ్మయ్యశాస్త్రి.

 

జైశ్రీరామ్.

శా. పున్నెంబున్ననె నీదు పాద యుగళిన్ బోధన్ మదిన్ గాంచనౌన్.

బున్నెంబున్ననె నీదు పూజలకునై ముందుండఁగా సాధ్యమౌన్

బున్నెంబున్ననె మా మొరల్ వినఁబడున్ బూజ్యుండ నీకున్. భళీ!.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!              6

జైహింద్.

Sunday, August 20, 2023

ఈశావాస్యోపనిత్ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారిపద్య భావములు

 జైశ్రీరామ్

ఈశావాస్యోపనిత్ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారిపద్య భావములు
శాంతి మంత్రః
ఓం. పూర్ణమద: పూర్ణమిదం - పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ - పూర్ణమేవావిశిష్యతే
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
శాంతి మంత్రము
కం. పూర్ణము బ్రహ్మము జగ మిది - పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్
పూర్ణం బగు నీ జగతికిఁ - బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
శాంతి మంత్రము
భావము. ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
1 వ మంత్రము.
ఈశావాస్య మిదంసర్వం - యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తే న భుంజీథాః - మాగృధః కస్య స్విద్ధనం. 
కం. భగవంతుడు భువి మాఱుచు - నగపడు నీ ప్రతిపదార్ధమందును నుండెన్
తగ నది త్యాగము చే నిపు - డె గాచికొను; మిది యెవరి ధనంబౌ. 1
భావము. జగతి యందు మార్పుచెందు నిది యంతయుఁ బరమేశ్వరునిచే నిండియుండెను. దానిని త్యాగముచే నిన్ను రక్షించుకొనుము. దేనిని గోరకుము . ఇది యెవరి ధనము ?
సంస్కృతమున "ఈశావాస్య " అని మొదలు పెట్టఁబడుటచే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చెను. అవిద్యను అజ్ఞానమును నశింపఁ జేయునది గాన ఉపనిషత్తు అని వ్యుత్పత్తి.

Thursday, August 3, 2023

వివాహ ఆహ్వాన శుభలేఖలో వేయఁదగిన నేను వ్రాసిన పద్యములు.

 

ఓం శ్రీమాత్రే నమః.

కం.  గణపతిపూజను విఘ్నం

బణువంతయు లేక జీవితాంతము శుభముల్,

మణిమాన్యంబులు, సుతులును,

ప్రణవాక్షరయోగసిద్ధి ప్రాప్తించునిలన్.

 

కం.  పట్టితి చేతిని, విడువను,

జట్టుగ నేడడుగులగ్నిసాక్షిగ వేయన్,

గుట్టుగ జీవితమంతయు

నెట్టగ తగు దైవబలము నిత్యంబుండున్.

 

కం.  సత్సంతానము పడయుచు

నుత్సాహముతోడ మనుట కుద్గతిఁ బెద్దల్ 

ప్రోత్సహమునిత్తురు తమ

వాత్సల్యము చూప వచ్చి  పరిణయవేళన్.

జైహింద్.