Saturday, June 20, 2026

దర్శనం నాటకవ్యాసాల రచయిత ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు అభినందన పంచరత్నములు.

జై శ్రీరామ్. 

శ్రీరస్తు,  శుభమస్తు, అవిఘ్నమస్తు.

దర్శనం నాటక వ్యాసాల రచయిత 

ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు 

అభినందన

 పంచరత్నములు.

రచన ... చింతా రామకృష్ణారావు. తే. 21 - 6 - 2026.


శా.  శ్రీమన్మంగళ మూలవంశజుఁడు రాశీభూత చైతన్యమౌ

ధీమంతుండగు మల్లికార్జునుఁడు ఖ్యాతిన్ దర్శనంబన్ మహో

ద్ధామంబై వెలుగొందు వ్యాస చయమున్ తా వ్రాసెనుప్పొంగుచున్,

శ్రీమంతంబగు వీరి వ్యాసచయమున్ బ్రీతిన్ బఠింపన్ దగున్.


చ.  పరహిత దర్శనంబిది, ప్రభాకలితుండగు మల్లికార్జు నా

క్షర సముదాయమిద్ది, మది గాంచఁగనౌ పదునాలుగంశముల్,

మురియుచు నాటకాంశములు ముచ్చటగా రచియించినారు, శ్రీ

కరులగు మల్లికార్జునులు, గౌరవమొప్పఁ బఠించి, పొంగితిన్.


సీ.  తెలుఁగులో నాటకంబుల రచనంబున పరిణామ విధమును వ్రాసినారు,

తొలి తెల్గు నాటక కళనొప్పు క్రీడాభిరామమున్ దెలిపిరి ప్రేమతోడ,

సురభి నాటకశోభఁ జూపిరి,  శ్రీ కందు కూరి నాటక శోభఁ జూపినారు,

నలశుభద్ర విజయ  కళనెన్ని చెప్పిరి, తిలకు నాటకములు తెలిపినారు,

గీ. అల యినాక్ నాటకములందు దళిత శోభ,

మహిత రాసాని నాటక మధురిమమును,

సీమ నాటక పద్ధతిన్ బ్రేమ వ్రాసి,

నాటకార్ణవ మధనుఁడైనారు వీరు.


ఉ. ఇంకను వ్రాసి పెక్కిటి ననేక విధంబులు దర్శనంబునన్

పొంకను గొల్పినారు తన పుస్తకమున్ బఠియించువారికిన్,

శంకరు సత్ కృపన్ గనిన సన్నుత సద్కవి మల్లికార్జనుం

డింకను పెక్కు గ్రంథములనేక శుభోద్గతి వ్రాయుగావుతన్.


ఉ.  మంగళమౌత మూల మహిమప్రద మల్లిక వంశమంతకున్,

మంగళమౌత నాటక సమంచిత లోకజనాళికిద్ధరన్,

మంగళమౌత పూజ్యులకు, మంగళముల్ కవి పండితాళికిన్,

మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశమాతకున్.

మంగళమ్...... మహత్..... శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.

Thursday, April 2, 2026

లాస్సేంజిల్స్ లో 10 వ సంవత్సరం జరుపుచున్న శ్రీసీతారామకల్యాణం. సందర్భంగా అభినందన పంచరత్నములు.

 జైశ్రీరామ్.

శ్రీరస్తు,                             శుభమస్తు.                అవిఘ్నమస్తు.

ఓం శ్రీమాత్రే నమః.

అమెరికా లోని లాస్సేంజిల్స్ సెమీవేలీ లో

వేలీ తెలుఁగు కమ్యూనిటీ వారు నిర్వహించుచున్న10వ సంవత్సారములుగా జరిపించుచున్న

శ్రీ సీతారామకల్యాణ మహోత్సవము.

పంచరత్నమాలిక.

రచన.    కవికల్పభూజ చింతా రామకృష్ణారావు. M.A.,


1. శా. శ్రీమన్మంగళ శాంభవీ! కనుమ, లాసేంజిల్సు పట్ణంబునన్ 

శ్రీమంతంబుగ వెల్గుచున్న శుభ వేలీతెల్గు కమ్యూనిటీ

క్షేమంబున్ వరలింపఁ జేయ భువిపై శ్రీ జానకీ రాములన్

ప్రేమన్ గల్పగ పెండ్లి చేసిరిచటన్ విశ్వంబె యుప్పొంగగన్.


2. మ.  మహనీయుల్, ప్రతిభా విశేష ధిషణుల్ మార్తాండ శర్మాఖ్యు లీ

మహిమోపేత శుభప్రదంబయిన సమ్మాన్యంపు కల్యాణమున్

రహియింపన్ జగమంతయున్ వెలుగగా ప్రఖ్యాతిగాఁ జేసి రీ

సహనోద్భాసితు నేలుమా రఘువరా! సంస్తుత్యమార్గంబునన్.


3. చం.  కొడిదల రామ్ శిరీషలునకుంఠితరీతిని సీతపెండ్లికై

వడివడి కర్యమగ్నులవ, భాసిలు చందును భార్యయున్ పనుల్

మడిగ నొనర్చుచుండగ, కుమారు లతల్  సహకారమీయఁగా

తడయక నిల్చు యా సుచరితన్ గొని వచ్చె మనోహరుండు తాన్.


4. చం.  నయగుణ బొమ్మకంటి సుజనార్ధను లాతని పత్నిఁగూడి యీ

ప్రియమగు కార్యమందు నొనరించగ పూజ వసించి యుండి రో

జయగుణ వర్ధనా! సుగుణసాంద్ర! జయంబులు కొల్పు రాఘవా!

రయమున వచ్చి పూజలకు రంజిలు భక్తులఁ గాంచి కావుమా.


5. శా.   సీతారాములపెండ్లి చేసిరి శుభశ్రీలొప్ప నిచ్చోట నా

సీతారాముల సత్కృపాజలధిలో జేగీయమానంబుగా

ఖ్యాతిన్ గాంచుచు వెల్గుచుండుత మహద్గణ్యంబుగా వేలిలో

నీ తెల్గున్ వరలించు దండు, గొనుతన్ నిత్యంబు మాంగళ్యమున్.


మంగళమ్.... మహత్ ... శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.
















Tuesday, March 3, 2026

శీమతి డా. మలయవాసిని గారికి అభినందనలు. అనేక కంద గీత గర్భ చంపక మాల.

జైశ్రీరామ్. 

శ్రీమతి డా. మలయవాసిని గారికి జగన్మాత ఆశీస్సులు.

అనేక కంద గీత గర్భ చంపక మాల.

👇🏼

వర గుణదాంబరో! మలయ వాసిని! మీకు నమస్కరింతు, శ్రీ

కర ప్రణవాక్షరా! సుజన గణ్య నయాన్విత శుభ్రతేజమా!

స్థిర వినయాకృతీ! శుభగతిన్ గని దైవము శోభగొల్పుగా

పర వినుతా! సదా సుఖము వర్ధన చేయు ప్రచోదనంబెదన్. 


చంపక గర్భస్థ కందము 1.

👇🏼

గుణదాంబరో! మలయ వా

సిని! మీకు నమస్కరింతు, శ్రీకర ప్రణవా!  

వినయాకృతీ! శుభగతిన్ 

గని దైవము శోభగొల్పుగాపర వినుతా! 


చంపక గర్భస్థ కందము 2.

👇🏼

ప్రణవాక్షరా! సుజన గ

ణ్య నయాన్విత శుభ్రతేజమా!స్థిర వినయా

వినుతా! సదా సుఖము వ

ర్ధన చేయు ప్రచోదనంబెదన్.వర గుణదా!


చంపక గర్భస్థ కందము 3.

 👇🏼

వినయాకృతీ! శుభగతిన్ 

గని దైవము శోభగొల్పుగాపర వినుతా! 

గుణదాంబరో! మలయ వా

సిని! మీకు నమస్కరింతు, శ్రీకర ప్రణవా! 


చంపక గర్భస్థ కందము 4.

👇🏼

వినుతా! సదా సుఖము వ

ర్ధన చేయు ప్రచోదనంబెదన్వర గుణదా!

ప్రణవాక్షరా! సుజన గ

ణ్య నయాన్విత శుభ్రతేజమా!స్థిర వినయా!

🙏🏽

అభినందనలతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్.