ఈ రోజు సామీ వివేకానంద జయతి అన్న విషయం యావద్భారతీయులకూ ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ఈ రోజును యువజన దినోత్సవంగా నిర్ణయించి, యువతకు స్ఫూర్తిని గొలిపే అత్యుత్తమమైన రోజు.
ఈ సందర్భంగా ముందుగా యావద్భారతీయ యువతీ యువకులకు నా మనఃపూర్వక అభినందనలు.
"నీ శక్తే నీ జీవితం... నీ బలహీనతే నీ మరణం..." అన్నారు స్వామీ వివేకానంద.
యువత నిర్వీర్యమైతే జాతికి చీడపట్టినట్టే. యువత ఆత్మ చైతన్యాన్నిపొందే విధంగా ఉండే శ్రీ వివేకానందుని అమృత వాక్కులసారాన్ని వరి గ్రథముల నుండి గ్రహిస్తూ, ఆత్మ చైతన్యం పొంది, యావత్ జాతికీ ముందుండి నడుపుతూ, ఆదర్శప్రాయ జీవనం సాగించడం ద్వారా భారతీయ ఔన్నత్యాన్ని ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో యినుమడింప చేయాలి.
తమలో నిబిడీకృతమై యున్న అనంత శక్తి యుక్తులను నిర్వీర్యం కానీకుండా ఉండాలంటే ముందుగా సామాజికమైన దౌర్భాగ్యపు అతఃపతన మార్గాలవైపు నెట్టే దురదృష్టకర స్వార్థైక జీవన, దుర్వ్యసనాదులను ప్రేరేపించే సినీమాలకు, దూరదర్శన కార్యక్రమాదులకూ, అంతర్జాలముద్వారా ప్రత్యక్షమయ్యే అనాహ్వానిత దృశ్యశ్రవణాదులకు దూరంగా ఆత్మస్థైర్యంతో అన్నిటికీ అతీతంగా ఉంటూ మన కన్న తల్లి భరతమాత మహద్భాగ్యనిధానమా అన్న విధంగా కష్ట స్ధ్యమైన అతీంద్రియ శక్తులను సంపాదించుకొని సామాజిక సన్మార్గదర్శకులుగా తమను తాము మలచుకొని తద్విధంగా మెలగాలనీ అట్టి మన భరత యువతను గని కన్న తల్లిదండ్రులూ, సమాజము మాతృ దేశము గర్వపడేలా పురోగమించాలనీ ఆశిస్తూ అభినందనలు మరొక్క సారి తెలియ జేస్తున్నాను.
జైహింద్.