ఓం శ్రీమాత్రే నమః.
కం. గణపతిపూజను విఘ్నం
బణువంతయు
లేక జీవితాంతము శుభముల్,
మణిమాన్యంబులు,
సుతులును,
ప్రణవాక్షరయోగసిద్ధి
ప్రాప్తించునిలన్.
కం. పట్టితి చేతిని, విడువను,
జట్టుగ నేడడుగులగ్నిసాక్షిగ వేయన్,
గుట్టుగ జీవితమంతయు
నెట్టగ తగు దైవబలము నిత్యంబుండున్.
కం. సత్సంతానము పడయుచు
నుత్సాహముతోడ మనుట కుద్గతిఁ బెద్దల్
ప్రోత్సహమునిత్తురు తమ
వాత్సల్యము చూప వచ్చి పరిణయవేళన్.
జైహింద్.
No comments:
Post a Comment