జైశ్రీరామ్
అద్భుతమైన పద్యాలు చక్కగా పాడి వినిపించిన శ్రీ సిధారెడ్డిగారికి ధన్యవాదములు.
జైహింద్.
పద్య విపంచిని మీటుచు , సద్యశమును కలుగజేయు చక్కని కృతులన్ , హృద్యంబుగ వ్రాసినచో , విద్యాధికులంత మెచ్చు విశ్వము పొగడున్.
జైశ్రీరామ్.
మాగాయ పచ్చడి మాహాత్మ్యము..
మాగాయ అంటే మామిడి కాయ. అపక్వ చూతఫలము. దానితో చేసే ఒఅక విధమయిన పచ్చడిని మాగాయ పచ్చడి అంటారు. దాని రుచి అద్భుతమనే చెప్పాలి. ఈ పచ్చడి అనారోగ్యముగా ఉన్నవారికి, బాలెంతలకూ కూడా పత్యంగా పెట్టుట మనలు పూర్వమునుండీ యున్నది. జ్వరపీడితులు అరుచి పోవడానికి ఈ పచ్చడిని చప్పరించుట నేను చూచాను.
దాని గొప్పదనం ఉత్పల మాలలో....
గాయకులందు దివ్యమగు కమ్మని పాట అదెట్లువచ్చు? స
న్నాయకులందు వాక్ప్రభ ఘనంబుగ ఎట్టుల వచ్చుచుండు? సు
జ్ఞేయముగాగ భోదనలు జీయరులెట్లు వచింత్రు? వారు "మా
గాయ భుజించుచుండుటనె" కారణమిద్దియె వారివృద్ధికిన్
జైహింద్.