శ్లో౹౹ అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్।
కృతకర్మక్షయో నాస్తి కల్పకోటిశతైరపి॥
ఆ.వె. అనుభవింప వలయు నశుభ,శుభఫలము
లాచరించు కర్మ మోచనకును,
కల్పశతముకోటి గడచిపోయినకాని
యనుభవింపవలయునట్టికర్మ.
భావము:- చేసిన కర్మ మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించవలసినదే.
వంద కోట్లకల్పాలకు కూడా చేసిన కర్మ అనుభవించకుండా క్షీణించదు.
No comments:
Post a Comment