జైశ్రీరామ్
నా అర్థాంగి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విజయలక్ష్మి
అమ్మవారి కృపచే నాకు లభించిన వరప్రసాదము.
ఉ. మాయని మందహాస ముఖి. మాటలు నేర్వని మౌనభాషి. నా
శ్రేయమె కోరు నెల్లపుడు చిత్రముగా నిరతంబు కాచు నన్.
ధీయుత. మార్గదర్శి కులదేవతపోలి రహించునింటిలో.
నీ యమ నాకు భార్యగ మహేశ్వరి పంపుటఁజేసి వచ్చెనే.
ఈ సుశీల ఆయురారోగ్య ఆనంద సౌభాగ్యాలతో
నాకు తోడుగా సంతోషంతో ఉండవలెనని
ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు లభించవలెనని కోరుకొంటూ
జగన్మాతకు ప్రణమిల్లుచుంటిని.
జైహింద్.
No comments:
Post a Comment