జైశ్రీరామ్.
77) తల్లి
చేతి ముద్ద పిల్లలకనురాగ - బంధమరయఁ జేయు, బ్రతుకఁ జేయు.
తల్లి ప్రేమ కొలుపు మల్లెల
మనసును. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి చేతితో పెట్టే భోజనము పిల్లలకు ప్రేమ బంధమును తెలియఁ జేయును.
బ్రతుకునట్లు చేయును. తల్లి ప్రేమ మాలో మల్లెల
వంటి మనసును కలుగఁ జేయును.
జైహింద్.