జైశ్రీరామ్.
696. ఓం
దైత్య శమన్యై నమః.
నామ వివరణ.
దైత్యులను
నశింపఁజేయు తల్లి మన అమ్మ.
చం. కరుణను సద్గుణంబులను గావుము నా యెడనుండి నీవు, నా
పరువును దీయు దుర్గుణ మవారిత రీతి నశింపఁ జేయుమా.
సురుచిర భావ సంపదను శోభిలునట్టుల నన్ను జేయుమా,,
నిరుపమవైన *దైత్య శమనీ*! నినుఁ గొల్చెద నమ్మ, భక్తితోన్.
జైహింద్.
No comments:
Post a Comment