జైశ్రీరామ్.
27) మస్తకంబు
చెడును మణుఁగుల బరువున్న- పుస్తకములు మోయ. బుడుతలమయ
వెన్నుపూస విఱుగు. వినిపించుకోరేల? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
మణుఁగులకొద్దీ బరువు గల పుస్తకాలను మోస్తుండడం వల్ల మా బుర్ర
చెడిపోతోందికదా! మేము చిన్న చిన్న పిల్లలము కదా! మా వెన్నుపూస విరిగిపోదా? మీరీ విషయం ఎందుకు
గ్రహించటం లేదు?
జైహింద్.
No comments:
Post a Comment