జైశ్రీరామ్.
36) బద్ధకమ్ముతోడ
పట్టించు కోకుండ - కాలమును గడిపెడి కన్నవారు
మార్గదర్శకులుగ
మాకెట్టులగుదురు? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
కాలము వాలా విలువైనది. అట్టి కాలము గడిచి
పోవుచున్నదని గ్రహించుకోకుండా బద్ధకముగా గడిపే తల్లిదండ్రులు ఉన్నట్లైతే వారు మాకు
మార్గదర్శకులెలా అగుదురు? (Time sence) కాల వివేచన కలిగి ఉండి బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉంటూ కాలంతోపాటు నడుస్తూ మమ్మల్ని నడిపించే తల్లిదండ్రులే మాకు
ఆదర్శము.
జైహింద్.
No comments:
Post a Comment