జైశ్రీరామ్.
బాలభావన శతకము 53వ పద్యము.
53) తల్లి ప్రేమ తీపి తలపక పిననాడు - కొట్టి తిట్టినాము కొరికినాము.తల్లి మనసు వెన్న దండించదేనాఁడు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు అమ్మ యొక్క ప్రేమ చిన్న తనములో తెలియక పోవుట చేత మేము ఆ ప్రేమ మూర్తిని కొట్టుట, తిట్టుట, కొరుకుట, మొదలగు పనులవలన ఎంతగానో బాధ పెట్టి యుంటిమి. ఐననూ వెన్న వంటి మనసున్న మా అమ్మ ఏనాడూ పిల్లలను దండించుట చేయలేదు. అట్టి తల్లి ఋణము ఏ బిడ్డ తీర్చుకొన గలఁడు? జీవితాంతము మేము మా తల్లిదండ్రులపై ప్రేమతో మెలగవలసి యున్నది.
జైహింద్.
No comments:
Post a Comment