Thursday, September 14, 2023

ప ద్య మే ప్ర చం డా స్త్రం! బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

జైశ్రీరామ్.

 ప ద్య మే ప్ర చం డా స్త్రం!

బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

 నాడు ఉద్దండ కవులకు పద్యమే ప్రచండాస్త్రంగా మారడం విడ్డూరం!

వేములవాడ భీమకవికైతే చెప్పనేయక్కరలేదు.అలాంటి పద్యాలు

రసనాగ్రంమీద నర్తన చేస్తాయి.

"ఆఱింటను త బెట్టిన వారింటను పీనుగెళ్ళు వసుమతిలోనన్"-

అనే దొకటి ప్రజానీకంలో నాడు ప్రచారంలో ఉండేది.

ఆఱవ అక్షరంగా  త కారమునుపయోగించి యెవరిపైనా 

పద్యంచెప్పరాదని దానిభావం.ఒకవేళచెపితేనో? ఎవరనిగూర్చి 

పద్యంచెప్పబడిందో ఆవ్సక్తి హరీ మన్నట్టే! వాడికీలోకంలో నూకలుతీరినట్లే.

అలాగజరిగినకథలున్నాయా?అంటే, ఉన్నాయంటున్నారు.

అందులో ఒకకథ మనమిప్పుడు విందాం.

            ఆకథానాయకుడు మనఉద్దండకవి వేములవాడ భీమనయే! 

నాటికవులలో కొందరు సంచారశీలురు.వారు సపరివారంగా తిరుగుతూ 

రాజాస్థానములకేగి ప్రభువులను రంజించి విత్తమార్జించేవారు.

వారిపరివారంలో భార్యాపిల్లలు సేవకులేగాక,వారియుంపుడు 

గత్తెలుగూడా వెంటరావడం నాటిముఖ్యవిశేషం.

            భీమకవి సపరివారుడై పర్యటనచేస్తూ,తూర్పుగోదావరిలోని,

"గుడిమెట్టలంక"కువిచ్చేసెనట.దానికొకమాండలిక ప్రభువు ఏలిక.

అతనిపేరు "పోతరాజు"-

            భీమకవి గ్రామసమీపమునగల సత్రమునందు బసచేసి 

తమరాకను ప్రభువునకు తెలియజేసెను.కానీ ఆప్రభువునకు 

కవిత్వముపై నాశక్తిలేకపోగా ,కవులను చిన్నచూపుచూచెడువాడు. 

పోతరాజు భీమకవినాహ్వానింపలేదు.అందుకు కవి మిగులవగచి 

తనవాహనమైన( ఆడ)గుఱ్ఱమునెక్కి కోటలోనికి బోయిప్రభువును 

దర్శించెనట.

పోతరాజుకు బలిసిన భీమకవి గుఱ్ఱముమీద కన్నుబడినది.

ఎలాగైనా దాన్ని అపహరించాలనుకున్నాడు."నీకవిత్వం 

వినటానికి మాకిప్పుడు సమయంలేదు.కవిత్వంమాట అటుంచు,

నీగుర్రంబాగుంది.అయినా ఊరూరాతిరిగిబిచ్చమెత్తే నీకు 

గుర్రమెందుకు?దానినిమాకమ్మై యెంతసొమ్ముకావాలో అడగమన్నాడు.

దానినమ్మనన్నాడుభీమకవి.అయితే మాకోటలోకి మాఅనుమతిలేనిదే 

వచ్చిన ఈగుఱ్ఱాన్ని మేంజప్తుచేశాం.

ఇకమెదలకుండా పొమ్మన్నాడు."

భీమకవి రగిలిపోయాడు. వెంటనే వాగ్బాణాన్ని పోతరాజుపై సంధించాడు.

"హయమది సీత పోతవసుధాధిపు డారయ రావణండు, ని

శ్చయముగ నేను రాఘవుడ, సహ్యజవారిధి, మారుడంజనా

ప్రియతనయుండు, లచ్చన విభీషణు,డా

గుడిమెట్టలంక, నా

జయమును, పోతరక్కసుని చావును, నేడవనాడు జూడుడీ!!

--అంటూ పోతరాజును శపించాడట!

పద్యంమొదటిపాదంలో 6వ అక్షరం త కారం అయింది .

ముందు దానిని గమనించండి.

పద్యభావం:-

     నాగుఱ్ఱమేమో సీత.పోతరాజుగారేమొ రావణాసురుడు.

నేను రాముడను. గోదావరే సముద్రం,మారయ్యే(గుర్రంబాగోగులుచూసే

సేవకుడు)ఆంజనేయుడు కాగా నేడురోజులలో నాశాపము ఫలించి 

యీపోతరాజు మరణించునుగాక!

నాహయముమరలనాకుదక్కునుగాక!

యనిశపించెనట. పోతరాజుమీసములు సవరింప.భీమన సత్రమునకు 

పయనించెనట.

     ఇది జరిగిన సరిగ్గా వారంరోజులకు కోటలోనుండి హాహాకారములు

".అయ్యయ్యో! పోతరాజు అకారణముగా మరణించినాడు.రోగమూలేదు,రొచ్చూలేదు".ఇదేమివిచిత్రమని,లోకులు 

వాపోవుచుండగా.వారిలో తెలివిగల సచివులకు భీమకవి శాపము 

గుర్తుకు వచ్చింది.వెంటనేవారు ఆలస్యంచేయకుండా

సత్రానికి వెళ్ళి భీమకవి పాదాలపైబడి క్షమించండని ప్రార్ధించారట.

అంతఃపురకాంతల రోదనలు విని మనసుకరగి భీమకవివారికి 

అభయమొసంగినాడట.

భీమకవి దయాళుడై శవప్రాయుడై పడియున్న పోతరాజు సమీపించి ,

అందరు వినుచుండగా,

"నాటి రఘురాము తమ్ముడు

బాటిగ సంజీవిచేత బ్రతికిన భంగిన్,

గాటికిఁబోనేటికిరా?

లేటవరపు బోతరాజ! లెమ్మా!రమ్మా!

-అని శాపోప శమనము పలికినాడట!.

 కలగన్నరీతి పోతరాజు లేచి,సచివులవలన జరిగింది తెలిసికొని,

కవిపాదములకు నమస్కరించి,గుఱ్ఱమును సవినయంగా 

సమర్పించుటేగాక,యధోచితంగా కవిని సత్కరించి పంపెనట!

యువకవులారా!ఇట్టి ఛందోరహస్యములను పెద్దలవలన తెలిసికొని 

పద్యములను వ్రాయుడు.లేకున్న లోకమునకు ప్రమాదము.

తెలిసికొని వ్రాసిన లోకమునకు ప్రమోదము.

స్వస్తి!

జైహింద్.