జైశ్రీరామ్.
48) స్వార్థ బుద్ధితోడ
సన్మార్గమును వీడి - దురిత వర్తనమున దూఱువడెడి
పెద్దవారు పెంచ పెంపు మాకెటులబ్బు? - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తమ స్వార్థ బుద్ధితో ప్రవర్తనలో సన్మార్గమును విడనాడి, దుర్మార్గ ప్రవర్తనతో నిందింపఁ బడుతూ ఉండెడి పెద్దవాళ్ళ పెంపులో మేమున్నచో
మాకు ఆధిక్యత అనునది ఏ విధముగా కలుగుతుంది?
జైహింద్.
No comments:
Post a Comment