జైశ్రీరామ్.
44) మద్య మాంసములను
మా ముందు సేవించ- మేము నేర్చుకొనమె మిమ్ముఁ జూచి?
మంచి తిండి తినుఁడు, మంచివే త్రాగుడు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మా ముందే మద్య మాంసాదులను సేవించుచుండగా, మిమ్ములను
చూచి మేము నేర్చుకొనమా? మీరెల్లప్పుడు మంచి తిన తగిన
పదార్థములనే తినుచు, త్రాగఁ దగిన పానీయములనే త్రాగుచుండుడు.
అది ఉభయులకు శ్రేయస్కరము.
జైహింద్.
No comments:
Post a Comment