జైశ్రీరామ్.
37) తమ సుఖంబు
కాంచు తమ బిడ్డ సుఖములో - తల్లిదండ్రులిలను ధర్మమనుచు.
కన్న వార లనిన కరుణకు ప్రతి
రూపు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల సుఖములోనే తమ సుఖమును కూడా
చూచుకొందురు. ఇదియే ధర్మమని వారు తలంతురు. భూమిపై అట్టి తల్లిదండ్రులు కరుణకు ప్రతి రూపులే.
జైహింద్.
No comments:
Post a Comment