జైశ్రీరామ్.
49) కులమునెంచకుండ
కలిసికట్టుగనుండు - సంఘ జనుల పెంపు చక్కన భువి.
కులము మతము నెంచి కూల్చఁ
బోకుడు మమ్ము. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
కులమతములను గణింపకుండా, సంఘీభావముతో
ఉండేటువంటి సంఘము లోని జనుల యొక్క పెంపు మాకు భూమిపై చక్కఁగనుండును. కులమతములనెంచి మమ్మల్ని కూల్చకండి.
జైహింద్.
No comments:
Post a Comment