Friday, April 22, 2016

తే.12-4-2012 న బ్రహ్మశ్ర్రీ పంతుల పరాక్రి ని సత్కరించిన అపురూప దృశ్యమ్.

జైశ్రీరామ్.

శ్రీ Pantula Parakrijaya Astro గారికి

కొంత కాలం క్రితం శ్రీ విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు వారు సత్కరించినప్పటి అపురూప దృశ్యం.

దీనిపై నా స్పందన.


బహుముఖ ప్రజ్ఞాశాలివి.
ఇహ పర సుఖ సాధకుఁడవు. హృద్యాద్భుత! నిన్
బహు సత్కృతులను గొల్చెడి
మహనీయులు మాన్యులిలను. మహిత పరాక్రీ! 
జైహింద్.

Tuesday, April 12, 2016

పద్మనాభ వృత్త గర్భ దండకము.

వివేకానంద నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామివారు ప్రతిష్ఠితులై ఇరువదియైదు వత్సరములయినది. ఈ రజతోత్సవము సందర్భముగా వ్రాసిన
పద్మనాభ వృత్త గర్భ దండకము.
శ్రీమద్వివే కార్ణ వానంద పూర్ణాఖ్య శ్రీమన్నగర్ వాస! శ్రీ భూప! దేవాఢ్య!
ప్రేమన్ మమున్ బ్రోచు భాస్వంతుఁడౌ పంచ వింశత్ ప్రపూర్ణా! ప్రభో వేంకటేశాఖ్య!
నీమంబుతో దుర్ముఖన్ దుర్గతుల్ మాపి నీ శక్తినే జూపి మమ్మేలు దేవార్తి
ప్రేమన్ నినుం గొల్చు భాక్తాళినే బ్రోచి ప్రీతిన్ ప్రవృద్ధిన్ ప్రసాదింతు వీవేర!
క్షేమంబుఁగానీవు క్షేత్రంబునన్ నిల్చికేల్బట్టి మమ్మున్ సదా నిల్పు చుండన్
మేమున్ నినున్ నమ్మి నీమమ్మునన్ నిన్ను మేనన్ మనన్ మన్ననన్ మాన మెన్నన్
కామాదులన్ బాపి ప్రేమాదులన్ జూపికర్తవ్యమున్ జేయఁగా చేయుమీవే!
సామాన్యులన్ మమ్ము సమ్మాన్యులన్ జేయ సద్ధర్మ సద్వర్తనల్ కొల్పితీవే!
మామాధవాశ్రీరమా హృన్నివాసాప్రమాణంబు నీవేరభక్తాళికెన్నన్!
శ్రీమన్మహాదేవ దేవాది దేవాప్రసీద ప్రభోభక్త మందార ధీరాఢ్య!
ధామంబు నీకౌను ధీమంత హృత్పాళి తత్వజ్ఞులెన్నున్ మదిన్ నిన్ను మిన్నన్ 
మామార్గమీవేసమారాధ్యుడీవే రమా వేంకటేశా నమస్తే నమస్తే.
చ. ఇరువది యైదు వర్షము లహీన దయామతి వెల్గి తీ స్థలిన్
దరి నలమేలుమంగయునుతత్వజ పద్మయు తోడు నిల్వగా
సురుచిర మందహాసదయ చూడర నిత్యము నీదు భక్తులన్.
ధర పయి శాస్వితుండవయి దర్శనమీయర నిత్యమిచ్చటన్.

Monday, April 11, 2016

నా దుర్ముఖి ఉగాది కవిత

జైశ్రీరామ్.
. శ్రీ మేధావు లనన్య సాధ్య సుగుణ శ్రీ జ్ఞాన తేజో నిధుల్,
ప్రేమోద్భాసిత సత్కవీంద్ర మణులున్, విజ్ఞాన సంపన్నులున్,,
నా మీదన్ దయఁ జూపు సన్నిహితులున్, నా సోదరీ సోదరుల్,
ప్రేమన్ వందనమాచరింతుఁ గొనుడీ! ప్రీతిన్ ననున్ గాంచుడీ!
. స్వాగతోక్తి గర్భ మత్తేభము. (భావ గోపన చిత్రము)
కరుణోత్పాదుని, జ్ఞాన పూర్ణుని, త్రిలోక స్వామినా రాఘవున్,
ధరితోత్కార్ముక శోభితున్, బుధ నుతున్, ద్రై ణ్య వేదాత్మునిన్,
చరితోల్లేఖినమేయ శాంతి కలితున్, సత్ త్వదున్, సద్ఘృణిన్,
ధరకే యంకితమైన దైవమును, బోధన్ మున్దుగాఁ గొల్చెదన్!
. ఆటవెలది త్రిక గర్భ సీసము.
దుష్ట జనులఁజంపు దుర్ముఖీ! స్వాగతమ్. దుర్మద జనపాళీఁ ద్రుంచ రమ్ము.
జ్జనులను కాచు సద్భావనను రమ్ము, - గాయకులను కావ కదలి రమ్ము.
సత్యతులఁ గావ స్తుత్యంబుగా రమ్ము. విశ్వ జనులఁ గావ వేగ రమ్ము.
కావ్యతతిని గావ కారుణ్యమున రమ్ము. - సంపద తెలుగింట నింప రమ్ము.
.వె. సరస సుగుణ గణ్య! నిరపాయవై రమ్ము. - సుజనుల నలరించు శుభద! రమ్ము.
నిరుపమ గుణ ధామ! పరమాత్మవై రమ్ము. -  స్వాగత మిదె గొనుచు వరల రమ్ము.
. శా. దుర్మార్గంబులనుండు దుష్ట జనులన్, దుర్మార్గముం ద్రుంచఁగన్
ధర్మంబున్ నడిపించు సజ్జన తతిన్ ధాత్రిన్ గృపం బెంచఁగన్
మర్మాత్ముల్ కడ మర్మమున్, మహితులన్ మాన్యత్వమున్ జూపఁగన్,
ధర్మోద్భాసిగ రమ్ము! స్వాగతమిదే్. తత్వార్థ మేదుర్ముఖీ!
. . దుర్ముఖి నామ మాత్రమున దుర్ముఖి వౌదువొ? సత్య భాస! ఓ
దుర్ముఖి! సత్య సంధులను, దుర్భర జీవ జనాళి వ్రేచు నా
దుర్ముఖపాళి పాలిటనె దుర్ముఖివీవు. నిజంబు. నీవికన్ 
దుర్ముఖి నామమున్ మరచి తోడుగనుండుమ సజ్జనాళికిన్. 
. . వనములు, చందనాది తరు భాసితముల్ భువి, మానవాళి జీ
వనములు, జంతుకోటికిలఁ బ్రాపు, కవీంద్రులకున్ మనోజ్ఞ  భా
వనములు, సన్మునీశ్వర ప్రభావ వివర్ధిత సత్య శాంతి శో
భనములు, కావుమయ్య వనపాళిని. దుర్ముఖి నామ వత్సరా!
. . కలిత వసంత శోభనల క్రాంతిని వెల్గుచు గణ్యమైన దీ 
సులలిత సుందరోజ్వల వసుంధర భారతి. యిట్టి ధాత్రిపై 
మలిన మనస్కులున్, మరియు మానవతా రహితాత్మ దుష్టులున్
వెలయుచునుండిరీవె కని వేల్పులు మెచ్చ నశింపఁజేయుమా! 
. . పంట పొలాలనమ్ముకొను వచ్చెడి సొమ్ముకు రైతులాశచే.
నింటను పెంచు ధేనువులనిట్లె ధనంబునకమ్ముచుండ్రి. నీ
వుంటివి చూడగా నిక మహోద్ధృత భీషణ తీక్ష్ణ దృష్ఠితో 
సుంటలనందరిన్ గదిమి. శోభిలఁ కావుమ ధాత్రి గోవులన్. 
. . జననిగ జన్మనిచ్చు, సహజన్మను సోదరి ప్రేమజూపు,
ద్ఘనతర మైత్రి నిల్చు, సహధర్మచరంబున తోడునిల్చు స
ద్గుణవతి స్త్రీ, మహేశ్వరియె. క్రోధముఁ జూపుట కొట్టుచుంట దు
ర్జనులకు నిత్య కృత్యమయె. చంపు దురాత్ముల, స్త్రీలఁ గావుమా!
౧౦. మత్తకోకిల ద్విపద గర్భ సీసము 
దేశమున్ గుణ పాళి దీపిత దేవ స - న్నుత దుర్ముఖీ! మానవతను నిలుపు.
ఆశపెంచుమ సన్మహాత్ముల యందునన్ - కని బ్రోవుమా! నీవు కల్పకమయి.
శ్రీశు వేడుమ! చిద్వశీకృత చిత్తజా - ళిని బెంచగా సత్య ఫలముఁ గనఁగ. 
క్లేశసంహతి బాపు. క్లిష్టత లేక వ - ర్తిలఁ జేయుమా! సత్సకల విధేయ!
గీ. నిరుపమానంద సామ్రాజ్య నేతవగుమ! - సిరులు వర్ధిల్లఁ జేయుమా! చిద్విశాల.
కవులు కోరెడి మంచిని కలుఁగ జేసి, - దుర్విధానంబు విడనాడి తోడు నిలుమ! 
౧౧. మత్తకోకిల ద్విపద గర్భ సీసము
దుర్ముఖీ! దురితంబు దూరము త్రోసి కా - వుమ లోకమున్ జేయుమమలినముఁగ.
మర్మచిత్తుల నెల్ల మంచిగ మార్చి శో - భిలఁ జేయుమా! నీవు ప్రీతితోడ.
దుర్మదాంధుల మాపి తోడ్పడు స్తుత్య! స - ద్వరమీయుమా మాకు వర్ధిలఁగను.
కర్మదూరులఁ గాల్చి ఖ్యాతిని గ్రాలుమా - భువి సద్గతిన్ బ్రోచు పుణ్య చరిత!
గీ. సజ్జనాళికి సత్వర శాంతిఁ జూపి, - సత్కృపాళికి సద్గతి సరళిఁ గూర్చి
సద్ద్విజాళిని సంస్కార సరణిఁ దేల్చి - మాటనిలఁబెట్టుమయ్య నా మనవి వినుచు.
౧౨. మత్తకోకిల ద్విపద గర్భ సీసము
శ్రీమనోజ్ఞుఁడదేవశ్రీనరసింహదు ర్ముఖి వచ్చెరాకూర్చుమఖిల సుగతి.
ధీమతాళిని కాచి తేజము దిద్ది శో భను కూర్చ రావేరభాను తేజ!
నామదిన్ గని చూడు నాథుఁడనన్నునీ  కృప దేల్చరావేరక్షితిని నిలుప.
శ్రీమదాంధ్రులనెల్ల చేకొను శ్రీశధ ర్మము నిల్పరారక్షేమమునిడంగ.
గీ. సత్య తేజ సుదుర్ముఖిన్ జయములిచ్చిజయజయధ్వానములతోడ సభలు వెలుఁగ
ధీ విశాలురు సత్కవుల్ తేజరిలఁగఁ జేసి కాపాడరా కొల్పి చిత్ర కవిత.
౧౩సీభూదేవి పులకించు పుష్పగుచ్ఛములను పూసెడి భూజ సింహాసనమయి.
పసిడివన్నెలు చిందు కుసుమాంగనల్ తేనె దెసలెల్ల చింద మేదినిమునుంగ.
కుసుమాస్త్రునకు తోడు కుదిరె వసంతుఁడువాసంతి శోభలు వసుధనిండె.
కోకిల పాటలున్తాకెడి చిఱు గాలిసెలయేళ్ళ సవ్వళుల్ చిత్తమొత్త,
గీకవుల కవితలు ప్రకృతిని గౌరవింపసహజ దుర్ముఖి పొంగుచు సమ్ముఖుఁడయె.
సుజన పాళికిఁ గూర్చఁగ  శోభ లెలమి దుర్ముఖాఖ్యుఁడు సమ్ముఖోద్భర్మమయ్యె.  
౧౪కంద గర్భ గీత యుత సీస గర్భ కంద మాలిక.
స్మర జనకుని  వర సచివునిస్మరణ వి --నుత మతులును పరమత హితు లగు/టన్
తరళ జగతి గిరి పురజుల నిరుపమ --దరహసన మహిమ నెరపు సభల/నే
కరి వరద ! నుత  జగతి గిరి పురజుల -- నియతి చరుల వలపు నిరుపమము/నౌన్.
సురుచిరము సుజన శుభదము పరహిత -- వర రుచిరము నిహ పర వినుతము/నౌన్.
కంద గర్భ గీతము.
జగతి కనుట ఘన మతులను --గగనమగు నిజము సుగుణులఁ గని కృప నిలుప--నగును.
ప్రగతిఁ గన జనుల నిలుపర! --జగతిగిరి ప్రతిభ వెలయఁగ జగతినివరలఁ గనుమ.
జైహింద్.                                                             

Sunday, April 10, 2016

నిజాంపేట రామాలయంలో జరిగిన అష్టావధానము. . . అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.

జైశ్రీరామ్. 
నిజాంపేట రామాలయంలో జరిగిన 
అష్టావధానము
అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.
సమస్య: శ్రీ చింతా రామకృష్ణా రావు.
౧. సమస్య: 
" హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో."
పూరణ: 
శర్మదమైనప్రక్రియల చాల తనర్చెడినాటకంబులో
కర్మలు చ్యు పాత్రలుసుఖంబుగ తాము విరామమొందగా
హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
నర్మ వచోభిరాముఁగ గనన్ దనెసోదరియౌ కతంబునన్.

౨. దత్తపది: 
గుడి - బడి - తడి - మడి. పదములు ఉపయోగించి రామాయనాంశము ఐచ్ఛిక ఛందములో.
పూరణ: గుడి వేల్పుల పూజలు రా
బడిరాజరికంబున సుంత భావింపక పు
త్తడిచొక్కపు చారితి యి
మ్మడిముమ్మడి ఖ్యాతి గాంచ మహి రాముండై.

౩. వర్ణన:
శ్రీరామ భావన:
పూరణ:
ఆదర్శ గృహస్థునిగా
సోదరునిగ, సుతుగ, పతిగ, క్షోణింజెలఁగన్
దా దా పుట్టెను రఘుపతి 
మేదుర సాధ్వి గను సీత మేదిని వెలగన్.

౪. నిషిద్ధాక్షరి:
తాటక సంహారము:
దృంచన్ సత్తిన్, వీకన్,
బెంచంధీర్తిన్ మనంగపేళ్ళున్ బీళ్ళున్,
మించం శాంతిని తారా
వించెన్ తాటకను దృంచ విజ్ఞత రామున్.

౫. ఆశువు:
వాతావరణ కాలుష్యము:
బొగ్గుపులుసువాయువుగొని పొలియు పసుపు
నింపి ప్రాణవాయువునిచ్చి నిఖిల జనుల
రక్షనము చేయు యిండ్ల నిర్మానములను
మంచములు చేయుటకుపయోగించఁబడెడు
మూలమగుచుండు వృక్షంబుముఖ్యముగను,
దాని ఘనతను తెల్పగా తరమె నాకు?
౬. అప్రస్తుత ప్రసంగము:
౭. గడులు గణితము.
౮. వార గణనము:
జైహింద్.

Friday, April 8, 2016

శ్రీ దుర్ముఖి ఉగాది 08-4-2016 న ష్టూడియో యన్ లో నవ్వుల సందడి కార్యక్రమం.

జైశ్రీరామ్.

జైహింద్.

“దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్”

జైశ్రీరామ్. 
దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్
                       "శ్రీరామకవిచంద్రుని నేను రెండవ శ్రీనాధునిగా నామనస్సులోఅనుకొందును …ఇక్కవి సహజపాండిత్య విషయముననే కాక భాగవతాంధ్రీకరణప్రసక్తియందుఁగూడ బోతరాజు గారేఈయనసరసకవి,విద్వత్కవి,ఆశుకవి,దాత,ేత.... 19వ శతాబ్దమున నుదయించిన యాంధ్రకవులలో నిట్టికవి మృగ్యుడుఇన్నియదృష్టములు సంఘటించిన కవి లేనే లేఁడు.ఇవి దాసు శ్రీరామకవి కవితా కౌశల్యాన్ని కొనియాడుతూశతావధాని బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి  గారు అన్నమాటలుప్రముఖన్యాయవాదిసంఘసంస్కర్త, వాగ్గేయకారుడుమహాకవిగా 19  శతాబ్దములోఆంధ్రదేశంలో సంగీత,సాహిత్య,సాంస్కృతిక రంగాలను,సంఘసంస్కరణోద్యమాలను ప్రభావితము చేసిన బహుముఖ ప్రఙ్ఞాశాలి  దాసు శ్రీరాములు  ఏప్రిల్ 8,  1846  కూరాడ గ్రామంలో జన్మించారు.కృష్ణాజిల్లా,ముదినేపల్లి మండలంలో అల్లూరిఅగ్రహారీకులు,సంపన్నకుటుంబీకులు కన్నయ్యకామమ్మ పుణ్యదంపతులకుఏకైకసంతానంస్వయంకృషితోనే విద్యాభ్యాసం చేస్తూ   సంస్కృతాంధ్ర భాషల్లోపండితులై   ప్రబంధాలుపురాణాలు,   నాటకాలుశతకాలు,ధర్మశాస్త్రగ్రంధాలు,కృతులు,జావళీలు,పదములు,యక్షగానాలు మొదలైన వైవిధ్య ప్రక్రియలలో ముప్పదికి పైగా గ్రంధాలు రచించారు.  వారి రచనలో చివరదిమకుటాయమానమైన  శ్రీ దేవీభాగవతము. ఆశుకవితాధారగా ఐదున్నర నెలలస్వల్పకాలంలో అనువదించారు.
                శ్రీరాములు గారు అసామాన్యమైన మేధస్సుకలవారు. 'గీర్వాణపీఠం'గా పేరుపొందిన ఆకిరిపల్లి లో అప్పటి నూజివీటి సంస్థానాధీశులు ఏర్పరిచిన నెలకు 8 అణాల ఉపకారవేతనంతో (1858 సం.లొ) పదినెలలు ఉండిసంస్కృత  వ్యాకరణం నేర్చుకోవటమే కాకుండా , అష్టావధానశతఘంటకవనాలలో సిద్ధ హస్తులైనారు. ప్రప్రథమంగా  అష్ఠావధాన ,శతావధానరచనాసంవిధానాన్నిఆంధ్ర దేశానికి పరిచయం చేసివిస్తృత ప్రచారం కల్పించినఘనాపాఠి నూజివీడు సంస్థాన విద్వాంసులువిద్వాన్ మాడభూషివెంకటాచార్యుల వారు (1835-1897) 12 ఏళ్ళ బాలుడైన శ్రీరాములు యొక్క ఆశుకవితా పాటవానికి, వ్యస్తాక్షరీ ప్ర్రక్రియలో ప్రతిభకు ముగ్ధుడై ఆశువుగాదాసురామ కవితా లీలాబ్ది నోలలాడితిన్."అంటూ ఈపద్యం చెప్పి ఆశీర్వదించారు
                           "పది రెండేడుల యీడునం గవితఁ చెప్పంబూని వ్యస్తాక్షరీ
                             విదభిఖ్యాతిఁ బొసంగి లేఖ కశత వ్రీడాకరంబైన మే
                             రఁ దుదిన్ బద్యము లల్లి సద్గణిత హోరాశాస్త్రసామర్ధ్యముల్
                             వెదజల్లం దగు దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్." 

                                 ఆమహనీయుని జయంతి నాడు స్మరించుకుందాము.
జైహింద్.

శ్రీ దుర్ముఖ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రచన : `అవధానరత్న` డా.మాడుగుల అనిల్ కుమార్

జైశ్రీరామ్,
మిత్రులందరికీ శ్రీ దుర్ముఖ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
శ్రీ దుర్ముఖ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పద్యరత్నములు.
రచన : `అవధానరత్న` డా.మాడుగుల అనిల్ కుమార్
శా.శ్రీమన్మన్మథనామవత్సరము యిచ్చెన్ సౌఖ్య సంపత్తులన్
ప్రేమించెన్ వసుధాతలంబు అటుపై వీడ్కోలు పల్కెన్ తగన్
రామారత్నము లక్ష్మి వెంటబడ దౌర్భాగ్యంబులన్ బాపుచున్
శ్రీమద్దుర్ముఖ నామ వత్సరము విచ్చేసెన్ ప్రమోదమ్ముగన్ || . 1
ఉ. కోకిల శ్రావ్యకంఠమది క్షోణిజనమ్ముల నిద్ర లేపుచున్
వ్యాకులమెల్లబాపుచునుగాది దినమ్మును గుర్తుజేయగా
చీకటి దొల్చి భానుడు ప్రసీదుడునౌచు వసంత మాసముం
జేకొనివచ్చె సంతసిల శ్రీయుత దుర్ముఖ వత్సరాబ్దిలో || .2
సుగంధి : వానలేక మన్మథాఖ్య వర్షమందు కర్షకుల్
దీనులైరి ఆత్మహత్యలే శరణ్యమంచు నీ
వైనదీర్చుమోయి వారి బాధ దుర్ముఖాబ్ది ! స
న్మానమందుచున్ ఉగాది మంగళంబు పల్కెదన్ || .3
ఉ.పోవును దుఃఖముల్ జరుగనున్నది శ్రేయములెల్లవేళలన్
చేవయొసంగు రైతులకుఁ చేనులు పండెడు వర్షపాతమే
కావలయున్ ధరిత్రి చిరకాలమభీప్సిత సస్యపూర్ణమౌ
దీవెనలిచ్చెడున్ తిరుపతీశ్వరుడే నవదుర్ముఖాబ్దిలో || .4
కవిరాజవిరాజితము :
సురుచిరపల్లవ శోభనుఁదోడ్కొని చూతమహీరుహముల్ ధరణిన్
పురజనగేహము ముంగిలి భాగము ముచ్చటగొల్పగ తోరణమై
వరరుచిరంబగు వన్నెలముగ్గులు భావ్యము నూత్నయుగాదిఘడిన్
కరవునుఁ దీర్చెడు కావ్యముఁగూర్చెడు కాలము
మారెడు దుర్ముఖిలో || .5
తే.గీ.
ఈ వసంతము గాదెలు నిండి యింపొసంగు
నదులుఁ బరవళ్ళుఁ ద్రొక్కుచు ముదముఁగూర్చు
షడ్రసోపేతమైనపచ్చడియె మాకు
ఆరు ఋతువులునానందమందజేయు. 6
**********జైహింద్ *******

Thursday, April 7, 2016

ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ష్టూడియో యన్ లో . . .

జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశ్శివాయ.
ఆర్యులారా!
నూతన తెలుఁగు సంవత్సరాగమన శుభవేళలో మీకందరికీ నా శుభాకాంక్షలు. 
శ్రీదేవీ హృదయాబ్జ భృంగ విలసచ్ఛ్రీ మన్మహావిష్ణువే
మోదంబున్ మిముఁ గాచుఁగావుత! మహత్పుణ్యంబు చేకూర్చుతన్,
బాధల్ కానని భక్తితత్పరతయున్, భద్రాత్మయున్, భాగ్యమున్,
శ్రీదేవీ కరుణార్ద్రదృష్టి కలుగన్ జేయున్ సదా దుర్ముఖిన్.
శుభాకాంక్షలతో
మీ
చింతా రామకృష్ణారావు.
ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ష్టూడియో యన్ లోనేను పాల్గొనిన హాస్యావధానం ప్రసారమౌతుంది. అవకాశం ఉంటే చూడగలరేమోనని తెలియజేయుచున్నాను.
జైహింద్