జైశ్రీరామ్.
33) మంచి
మాటలాడి మన్నన నుండెడి - తల్లిదండ్రులున్న ధన్యమదియె.
తప్పుచేయకుండ గొప్పగా మెలగుడో - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మంచిగా మాటాడుతూ మన్ననలందుతూ ఉండే తల్లిదండ్రులు కలిగి ఉండుట కంటే ధన్యత
మాకేమున్నది? తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుడు పనులకొడికట్టకుండా
గొప్పగా ప్రవర్తించవలసి ఉన్నదని గ్రహింతురుగాక.
జైహింద్.
No comments:
Post a Comment