జైశ్రీరామ్.
26) పుస్తకములు
మాకు బస్తాలతో యిచ్చి - మూపుపైన పెట్టి మోయమనిన
మోయు బరువు చేత మొద్దుగా మారమా? - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చదువు పేరు చెప్పి మేము మోయలేనన్ని పూస్తకాలు కొనిపించి, పెద్ద బస్తాలవంటి సంచీలో ఉంచి మా వీపుపై పెట్టి మోయిస్తున్నారు. ఈ బరువు మోయడం వల్ల మేము మొద్దుబారిపోతున్న విషయమెప్పుడైనా మీరు ఆలోచించారా? పుస్తకాలు ఎక్కువ ఉంటేనే బాగా చదివిస్తున్నామన్న భావన తల్లిదండ్రులలోను
ఉపాధ్యాయులలోను తొలగి పోవాలి.
జైహింద్.
No comments:
Post a Comment