జైశ్రీరామ్.
బాల భావన. 51వ పద్యము.
51) తల్లి
ప్రేమ పంచి తల్లడిల్లుచునుండు - పిల్లవాఁడు పుట్టి పెరుఁగు వరకు
తండ్రి బ్రతుక నేర్ప దండించి,
చింతించు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పిల్లలను కని వారు పెరిగే వరకు తల్లి తన ప్రేమను పంచుచు వారి కొఱకై
తల్లడిల్లుచునే యుండును. అంతటి ప్రేమ మూర్తి అమ్మ. తండ్రి పిల్లలకు బ్రతుకుట నేర్పుట కొఱకు తప్పని పరిస్థితిలో దండించి,
ఆ తరువాత అయ్యో ఎందుకు పిల్లవానిని దండించానా అని విచారించుచుండు.ను. అంతటి జాలి గుండె కలవాడు తండ్రి..
జైహింద్.
No comments:
Post a Comment