జైశ్రీరామ్.
46) పేదవారి
నెల్ల సాదరంబుఁగ చూచి - ప్రేమ ధనము పంచి వెలుగు నెవరు
వారె భువిని మాకు నారాధ్య దైవముల్. - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ధనము లేని పేదవారిని ఆదరముతో చూచుచు, ప్రేమ అనే
దనమును వారికి పంచిపెట్టి ఎవరు
ప్రకాశింతురో అట్టి మహనీయులే మాకు ఆరాధ్య దైవములు.
జైహింద్.
No comments:
Post a Comment