జైశ్రీరామ్.
47) స్వార్థ
బుద్ధి వీడి పర సుఖంబును కోరు - ఘనుల మంచి గుణమె కాంతి మాకు
దారిఁ జూపి స్వార్థ దూరులఁ
జేయును. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! స్వార్థ బుద్ధిని విడనాడి, పరుల సుఖమునే ఎల్లప్పుడు
కోరుకొనుచు ఉండెడి మహనీయుల యొక్క మంచి గుణమే మాకు వెలుగు. మంచి
మార్గమును కనఁబరచి, మమ్ములను స్వార్థమునకు దూరముగా ఉండునట్లు
చేయండి.
జైహింద్.
No comments:
Post a Comment