జైశ్రీరామ్.
30) ఆట
పాటలాడి యమ్మతో నాన్నతో - ప్రేమ పంచుకొనిన క్షేమమొప్పు.
నట్టి ప్రేమ మాకుఁ గిట్టదా?
దక్కదా? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
ఆడుతూ పాడుతూ అమ్మా
నాన్నలతో ప్రేమగా హాయిగా ఉండడం మాకెంతో ఇష్టం. అది మాకు ఎంతో
క్షేమమని మీకు తెలియదా? అటువంటి ప్రేమ మాకు కిట్టదా? ఇక మాకు దక్కదా? ఆ ప్రేమ మాకు అందని ద్రాక్షయేనా?
జైహింద్.
No comments:
Post a Comment