Saturday, December 16, 2017

బాల భావన. 67వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్. 
67) చిన్నవారిమగుట నన్నియు తెలియక   -  తప్పుచేయుచుందుమొప్పనుకొని.
     తప్పు తెలియఁ జిప్పి , దండింప మానుఁడీ..  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నపిల్లలమగుట చేత తెలియకపోయిన కారణముగా తప్పులనుకూడా చేయఁదగిన పనులుగానే భావించుట చేత ఆ తప్పులు చేస్తాము. అటువంటి సమయంలో మీరు మాకు ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసేలాగ చెప్పండి. అంతేకాని మమ్మల్ని శిక్షించడం మీకు తగదు.
జైహింద్.

No comments: