Wednesday, December 6, 2017

బాల భావన. 59వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
59) కంటి ముందు మాకు  కనిపించు వాటిలో  - మంచి నెంచు నేర్పు మాకుఁ గొల్పి,
     మంచి చెడ్డలరసి మసలుట మప్పుడీపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కంటి ముందు కనిపించే వాటిలో మంచినే మేము గ్రహించే నైపుణ్యము మాకు నేర్పి, మంచియేదో, చెడు ఏదో మేము తెలుసుకొని మసలుకొనే విధముగా మమ్ములను తీర్చి దిద్దండి.
                                                                      జైహింద్

No comments: