Sunday, December 10, 2017

బాల భావన. 62వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.

62) పాఠశాలలందు పాఠముల్ చెప్పుచు  -  నాటఁలాఁడఁ జేయ హాయి కలుగు.!
      ఆట లాడ మాకు నట చోటు లేదుగా!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
                       
భావము. పాఠశలలలో  మాకు పాఠములు చెప్పుచూ, ఆటలు కూడా ఆడించుచున్నచో హాయిగా ఉండి, శారీరక మానసిక వికాశము మాకు కలుగును. ఐతే నేటి పాఠశాలలలో మేము ఆడుకొందామంటా ఆట స్థలములే లేవుకదా!జైహింద్.

No comments: