Friday, December 15, 2017

బాల భావన. 66వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు

జైశ్రీరామ్.
66) తిండి తినెడు వేళ మొండి చేతుము మేము  అమ్మ బుజ్జగించు, నరుచు నాన్న.
     అమ్మ నచ్చు, నాన్న యరుపు నచ్చదు మాకుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాకు భోజనము పెట్టేటప్పుడు మాకు వద్దు, మేము తినము అని మారాము చేస్తాము. అప్పుడు అమ్మ మమ్మల్ని బుజ్జగించి తిండి పెట్టుతుంది. నాన్న మాత్రం తినమని మాపై అరుస్తారు. అందుకే అమ్మంటే మాకు నచ్చుతుంది. నాన్న అరుపులు మాత్రం మాకు నచ్చవు.
 జైహింద్.

No comments: