Monday, December 4, 2017

బాల భావన. 57వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్
57) చిన్ననాడు మమ్ము మన్నన జేతురు  -  పెరుఁగుచున్న కొలది ప్రేమ తగ్గు
     మన్నన కరువైన మాకెట్లు తోచును?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో మన్నిస్తూ ఎంతగానో ప్రేమ కురిపిస్తారు. కాని మేము పెద్ద ఔతున్న కొద్దీ మాపై వారికి ఉండే ప్రేమ తగ్గిపోతుందని మాకు అనిపిస్తుంది. ఏలనందురా! చిన్నప్పుడు మమ్మల్ని వారు చూచినట్లుగా పెద్దైన కొద్దీ చూడరు. ఆ విధముగా వారు చూపించే ప్రేమ తగ్గుచున్నచో మాకు కష్టముగా ఉండదా?
జైహింద్   

No comments: