జైశ్రీరామ్
54) తండ్రి
ప్రేమ చూపు. తన వస్తు వేదైన - పాడు చేయ మమ్ము పట్టి కొట్టు.
తల్లి యట్లు కాక తండ్రిని
వారించు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తండ్రి పిల్లలపై ప్రేమ చూపించుచుండును . కాని ఏదైనా
తన వస్తువును పిల్లలు పాడు చేసినట్లైతే పట్టుకొని కొట్టును. కన్న
తల్లి మాత్రము ఆ విధముగా కాదు. దండింపఁ బోవుచున్న తండ్రిని
దండించనీయకుండా ఆమె అడ్డుకొనును
జైహింద్.