జైశ్రీరామ్.
4) ముద్దు
చేసి మాకు హద్దులు నేర్పరు. - హద్దు మీర
మమ్ము గ్రుద్దుదురయ.
హద్దు లెల్ల నేర్ప శ్రద్ధగా నేర్వమా? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్ము గారము చేసి, ఏది చేయ వచ్చునో ఏది చెయ్య కూడదో అనే వాటికి సంబంధించిన హద్దులు చెప్పరు.
తెలియక పోవుటవలన మేము హద్దులు దాటినచో మమ్ములను దండింతురు. మీరు మాకు ఆ విషయములను వివరించి చెప్పినచో మేము శ్రద్ధగా నేర్చుకొందుముకదా!
జైహింద్.
No comments:
Post a Comment