జైశ్రీరామ్.
15) శ్రద్ధఁ గొలిపి
భవిత నర్థవంతము చేయు - భవ్యమూర్తి తండ్రి బ్రహ్మ మాకు.
నవత మరిగి మమ్ము నడిపించ
మరచిరే ! - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
మాలో శ్రద్ధ కలిగించి, మా జీవితాలను
అర్థవంతంగా తీర్చిదిద్దే తండ్రి మాకు బ్రహ్మయే. అట్టి తండ్రి
ఈ నాడు ఆధునిక జీవన సరళిలో మమ్ములను పట్టించుకోవడం లేదుకదా! ఇది
ధర్మమేనా?
జైహింద్.
No comments:
Post a Comment