జైశ్రీరామ్.
13) శ్రవణ
పుటములందు చప్పుళ్ళు పడుచుండ - చదువుచున్నఁగాని మదికి పోదు.
చదువుచున్న మాకు సహకరింపరదేల? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే సమయంలో మీరు
అవసరమున్నవాటిని గూర్చి, అవసరము లేనివాటిని గూర్చి
మాటాడుకొంటూ ఏవేవో చప్పుళ్ళు చేస్తుంటారు. మా ఏకాగ్రతకు భంగం
వాటిల్లుతోంది కదా? మాకు మీరు చదువుకొనేటందుకు ఎందుకు
సహకరించడం లేదు?
జైహింద్.
No comments:
Post a Comment