జైశ్రీరామ్.
19) తల్లిదండ్రులందు
దండిఁగా దొరికెడి - ప్రేమ మధువుఁ గ్రోలఁ బ్రీతి మాకు.
పిల్లల విడనాడు పెద్దలు
పెద్దలా? - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి దండ్రులలో సమృద్ధముగా లభించెడి అకళంకమైన ప్రేమ అనే అమృతము సేవించుట
యనిన మాకెంతయో ప్రీతి.. అట్టి తల్లిదండ్రుల ప్రేమను కోరుకొనే
పిల్లల్ని విడిచిపెట్టే పెద్దలు పెద్దలా? ఏనాడూ మీ పిల్లలను
మీ ప్రేమకు దూరం చేయకండి.
జైహింద్.
No comments:
Post a Comment