జైశ్రీరామ్.
11) దూర దర్శనమును మీరు చూచుచు మమ్ము - మెదలకుండ చదువు చదువుమనిన
మనసు నిలుచునెటుల?
మాకది సాధ్యమా? -
పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శన యంత్రము ద్వారా
కార్యక్రమములను చూస్తూ, మమ్మల్ని కదలకుండా మెదలకుండా
చదవమంటారు. మీరు చూస్తున్న కార్యక్రమాలు అక్కడే ఉంటున్న మేము
చూడకుండా, ఆశబ్దము వినకుండా మమ్ములను మేము ఎలా
నిరోధించుకొనగలము? ఈ విషయమును మీరెందుకు ఆలోచించరు?
జైహింద్.
No comments:
Post a Comment