జైశ్రీరామ్.
బాల భావన.
( నీతి శతకము )
రచన: చింతా రామ కృష్ణా రావు
1) శ్రీశు
మదిని నిలిపి ‘ప్రేమగా మము చూచి - కావుమా’ యని మది కరఁగ వేడి,
పెద్దలైన మిమ్ము ప్రీతితో కొలుతుము
- పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. శ్రీమత్ జ్ఞాన సుసంపన్నులైన ఓ
పెద్దలారా! శ్రీమన్నారాయణుని మా మదిలో నిలిపి ప్రేమగా
మమ్ములను చూచి కాపాడుమా యని అతని మనసు కరిగే విధముగా ప్రార్థించి, పెద్దలైన మిమ్ములను ప్రేమతో కొలుచుదుము.
సశేషమ్..
జైహింద్.
No comments:
Post a Comment