జైశ్రీరామ్.
21) మాట
నేర్పు నేర్పి మన్నన నేర్పిన - మాటలాడఁ గలము మమత తోడ.
మాటలాడకున్న మమతలు పెరుగునా? - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పిల్లలు ఎవరెవరితో ఎలా మన్ననతో మాటలాడ వలెనో పెద్దలు నేర్పుచున్నచో తప్పక
నేర్చుకొని మసలు కొనగలము.. ఆ విధముగా నేర్పకపోతే ఎవరెవరితో
ఎలా మాటాడాలో నేర్వక మాటాడుటకు అలవాటు పడము. అందువల్ల ఒకరిపై
ఒకరికి ఉండ వలసిన మమతానురాగాలు కనిపించకుండా పోతాయికదా! ఆ తప్పు
మీరు మాకు శిక్షణ ఇవ్వకఫోవుటవలననే కదా?
జైహింద్.
No comments:
Post a Comment