జైశ్రీరామ్.
14) తిట్టుచుంద్రు
మమ్ము కొట్టుచు నుందురు - పెంచి పెద్ద
చేయు పెద్ద మీరు
మమ్ము మీరు తిట్ట మాటాడ
లేముగా! -
పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన
సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్మల్ని అవసరంగాను, ఒక్కొక్కప్పుడు అనవసరంగాను కొట్టుతూ తిట్టుతూ ఉంటారు. మమ్మల్ని పోషించి, పెంచే పెద్దవారు మీరు తిట్టితే
మిమ్మల్ని మేము ఏమి అనఁగలము చెప్పండి?
జైహింద్.
No comments:
Post a Comment