Friday, April 1, 2016

అష్టావధానమకు ఆహ్వానము.

జైశ్రీరామ్.
ఆహ్వానము.
సాహితీసమితి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, శేరిలింగంపల్లి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భముగా నిర్వహించు
అష్టావధానము.
అవధాని .. .. అవధానరత్న డా. మలుగ అంజయ్య శతావధాని.
తేది. 05 - 4 - 2016. మంగళవారం. సాయంత్రం  5 గంటలకు.
వేదిక. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం., చందానగర్.
ప్రారంభ సమావేశం.
అధ్యక్షులు ; శ్రీమూగల ప్రతాప రెడ్డి గారు. సాహితీసమితి గౌరవాధ్యక్షులు.
ప్రారంభకులు : శ్రీమతి డా.శరజ్జ్యోత్స్నారాణి గారు. ఆచార్యులు ; కేంద్రీయ విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
ముఖ్య అతిథి ; శ్రీ తమ్మినేని అన్నిరాజు గారు.
గౌరవ అతిథులు ; శ్రీ ఎన్.అశోక్ కుమార్.
శ్రీ గొట్టుముక్కల బ్రహ్మానందం గారు,
డా. శ్రీ చంద్రభూషణ్ గారు.
శ్రీ అత్తెల్లి వీరకాంతం గారు. సాహితీ సమితి అధ్యక్షులు. రంగారెడ్డి జిల్లా
శ్రీ రాపోలు విశ్వాసరెడ్డి గారు. సాహితీసమితి అధ్యక్షులు.శేరిలింగంపల్లి(మం)
ప్రార్థన. : శ్రీ కడియాల ప్రభాకర్ గారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త.
సంయోజకులు ; శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్.అవధానరత్న డా.మలుగ అంజయ్య 
శతావధానిగారి
అష్టావధానము
      సంచాలకులు ;         శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు.
                              ఆశువు :                 ప్రొ. శర్మ గారు
                         దత్తపది ;                 శ్రీ శ్రీధర్ గారు.
                         సమస్య ;                 శ్రీ చిక్కా రామదాసు గారు.
                              వర్ణన :                    శ్రీ శివరాత్రి యాదగిరి గారు.
                         నిషిద్ధాక్షరి :              శ్రీ వాడ్రేవు సత్యప్రసాద్, గారు .
                         ఛందోభాషణ :            శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు.
                         అప్రస్తుత ప్రసంగము ;  శ్రీ కామేశ్వరరావు గారు.
                         వార గణనము ;         శ్రీ మంగిపూడి వేంకటరమణమూర్త
                                                              
సహృదయ సాహితీ ప్రియులందరూముందుగావిచ్చేసి, ఈ అవధాన కార్యక్రమమునపాల్గొని, 
భావితరాలకు అందించాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. 
కన్వీనర్, తాడిబోయిన రామస్వామియాదవ్, 9440053859        
                     కార్యదర్శిఎం.రామమోహన్ రావు 9866605378                         జైహింద్.

Sunday, January 31, 2016

ఓటు దండకము . . . గోలకొండ పత్రిక 24-5-1934

జైశ్రీరామ్.
ఓటు దండకము ---గోల్కొండ పత్రిక సంపాదకులు.
క. నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ; నిజముగ సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా గతివి పతివి నిజముగ ఓటర్!
శా. లావొక్కింతయులేదు;ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్దప్పెను మూర్చవచ్చె; తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
ఓటే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే వోటర కావవే వరద సం రక్షించు భద్రాత్మకా-
దండకము
మహా భాగ్యనగరాన మా పూర్వపుణ్యాన మే మెన్నియో యేండ్లు చూడంగ చూడంగ మా బాల్యమున్ యౌవనత్వంబు
మా ప్రాయముల్ మనో దార్ఢ్యముల్ క్రుంగుచున్ పొయి వృధ్ధాప్యమున్ పొంది వెండ్రుకల్ తెల్లనై ముప్పయారేండ్లు అటు గడ్చి ఇటు గడ్చి
ఈనాటికిన్వచ్చె యీ కొత్త ఖానూను మా గోర్కెలీడేర మా జన్మముల్ ధన్యతన్ బొందె నో బల్దియా శాసనంబో ఇదే నీకు వేవేల దణ్ణాలు
కైకొమ్ము తల్లీ వినో వొటరా--
మూడేండ్ల(ఐదేండ్ల) కోసారి నీ పాదపద్మంబులం గొల్చి నిన్ను నే దలచెదన్ నే పిలిచెదన్ నీ కటాక్షంబునన్ జూడవే దాతవై బ్రోవవే దగ్గిరన్
నిల్వవే స్వామి నిన్నెంచ నే నెంతవాడన్ దయా దృష్టి వీక్షింపవే నా ఓటు నాకిచ్చి నన్నెట్టులైనన్ సఫాయీకమేటీకి మెంబర్నుగా
జేసినన్ జాలు నా వంశమున్ దేశమున్ ధన్యతం బొందు ఆ మీద నా పూర్వపుణ్యంబు నా చాకచక్యంబు నా భావి భాగ్యంబు నా తంత్ర
నాదంబు సవ్యంబుగా నున్నచో ఆ నిచ్చెనంబట్టి ఎంతైన పైబైకి ఎగబ్రాకగావచ్చు ఎన్ని హాట్ హోములైనన్ భుజింపంగ ఆటంకముల్లేవు
రాజ మాన్యుండగావచ్చు పేదసాదల్ భయంబంద అటు తిర్గి ఇటు తిర్గి ఎంతెంత పేరైన నే పొందగావచ్చు కొద్ది యుద్యోగులన్ శక్తి
యున్నంత ఏడ్పించగావచ్చు వీలుగా నున్నచో కొద్ది మేల్జేసి షాభాషు షాభాషు అనిపించుకోవచ్చు ఏవైన లాభాలు సాధించుకోవచ్చు
కాబట్టి యెట్లైన నీ ఓటుతో గూడ బంధుమిత్రాది వర్గంబు ఓట్లన్ని నాకు నిప్పింపుమా నన్ను రక్షింపుమా లేమి పోగొట్టుమా దీనునిన్
బ్రోవగా దిక్కు నీవే గదా నీవేకులంబందు జన్మంబుగానీ నీ స్పర్స నీ చూపు నీ తీరు మొదలైన నీదే సమస్తంబు అస్పృస్యమౌ గాని
సాక్షాత్ పరబ్రహ్మ రూపంబుగా నుండు నీ ఓటు మాత్రంబె నిత్య సంపూతమై నెగడు లోకంబులన్ సంసారమున్ బాసి సౌఖ్యంబులన్ రోసి
నిద్రహారంబులన్ నీతి నియమంబులన్ నిత్యకృత్యంబులన్ మాని సర్వంబు వర్జించి యోగీశ్వరుంబోలి నీ దీక్షతో నుండి నీ ఓటు
వాంచించెదన్ నిన్ను యాచించెదన్ ఓటే సమస్తంబు ఓటే ప్రశస్తంబు ఓటే మహా ముక్తి ఓటే పర బ్రహ్మ తధ్ధారివైనట్టి ఓటర్ మహాదేవ
నమస్తే ! నమస్తే! నమః.
[గోలకొండ పత్రిక 24-5-1934]
జైహింద్.

Monday, January 19, 2015

బాల భావన ( నీతి శతకము )

జైశ్రీరామ్.
ఆర్యులారా! బాలల హృదయాలు కుసుమ కోమలాలు. అవి గాయపడకుండా ఉండే విధంగా వారి మనసులు తెలుసుకొని మీ నడవడికలో అవసరమైన మార్పులు చేసుకొని వారికి బంగారు భవితను కలిగించండి.
వారి భావాలేమిటో ఇక ఈ బాల భావన శతకంలో చదివి అనుసరించండి.
బాలల భవితకు శ్రీరామ రక్ష.
జైహింద్.

Tuesday, April 29, 2014

ఇంగితం ఉపయోగించి ఆత్మసాక్షిగా ఉత్తమ అభ్యర్థికే మీ వోటు వెయ్యండి.

జైశ్రీరామ్.
నా ప్రియమైన భారతీయ సహోదరీ సహోదర ఓటర మహాశయులకు హృదయ పూర్వకముగా నమస్కరించుతూ చేయుచున్న విన్నపము.
సోదరీ సోదరులారా! మన భారత దేశము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశముగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దేశము.
మన రాజ్యాంగ నిర్మాతలు అత్యంత శ్రద్ధాసక్తులతో భావి భారతప్రజానీకము యొక్క మహోజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా చేసిన రాజ్యాంగ నిర్మాణము ప్రపంచ విఖ్యాతినొందినది. ఐతే జరిగినదింత వరకూ ఎలాగున్నదీ అంటే శస్త్ర చికిత్స చక్కగా జరిగినది కాని రోగి మాత్రము ప్రాణములు కొల్పోయెను అన్నట్లుగా ఉంది.
మనము మనకు ప్రతినిధులుగా యోగ్యుడైన ఎమ్మెల్యే. ఎంపీ లను ఎన్నుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం మనకు దక్కింది.
అనేకమంది ఎవేవో వాగ్దానాలతో మన ఓటును అర్థిస్తున్నారు. చాలా మంది అమాయకులు అనేక విధాలుగా ప్రలోభ పెట్టబడుచున్నారు.
తెలివైనవారు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కాని చాలా మంది అమాయకులు వారు పెట్టే ప్రలోభాలకు లోనైపోతున్నారు.
కొందరభ్యర్థులైతే ప్రలోభాలకు గురిచేయడమే కాక దేవునిపై ప్రమాణం కూడా చేయిస్తున్నారు. హారతి కర్పూరం ఆర్పిస్తున్నారు.
ఆర్యులారా! నా మాట కొంచెం వినండి. దేవుడు మిమ్మల్ని లంచం పుచ్చుకోమంటాడా, అలా ఏదైనా ప్రళొభానికి మీరు గురైతే ఆ తప్పు మిమ్ములను ప్రలోభ[పెట్టినవారెకే కాని, మీది కాదు.
మీ హృదయంలో ఆ భగవంటుడుండి తీరుతాడు. ఆత్మ సాక్షిని కాదని మీరు ఓటు వేసినట్లైతే అది ఆ పరమాత్మ సహిస్తాడా?
మీకు ఎవ్వరెవ్వరెంతెంత ఏమేమి ఇచ్చినా  అదంతా మీ మనసులో పెట్టుకోకండి. ఏ ప్రమాణాలూ మీకు ఎటువంటి హానీ కలిగించవు.
ఈ మంచి సమయంలో మీవోటును దుర్వినియోగ పరిచారంటే ఆ పొరపాటు ఐదు సంవత్సరాలు అనుభవించ వలసి రావచ్చు.
మీ నిర్ణయం నిర్మొహమాటంగా ఈ రహస్య వోటింగ్ విధానంలోనైనా మీరు ప్రకటించుకోలేకపోతే మీరు జీవించి ఉన్నవారిగా మిమ్మల్ని మీరైనా భావించగలుగుతారా? ఆత్మ వంచన వద్దు. మీకెవరు బాగా పరిపాలన అందిస్తారని నమ్మకముంటే వారి గుర్తుపైనే ఓటు వెయ్యండి. ఎవ్వరూ నచ్చకపోయినట్లైతే నిర్మొహమాటంగా తిరస్కార వోటు వెయ్యండి.
మీ ఓటు మహనీయ మైన మన భరత మాత భవితను వ్రాస్తుంది. భావి భారత పౌరులజీవనాధారమై ఉందిఒ దయచేసి గుర్తించండి.
ఆత్మ సాక్షిగా ఓటు వెయ్యండి.ప్రలోభాల సాక్షిగా వెయ్యకండి.
శుభమస్తు.
మన భరత మాతకు మంచి భవిత కలుగు గాక. భారతీయులందరూ సుఖ సంతోషాలతో జీవింతురు గాక.
జైహింద్
జైహింద్
జైహింద్