Friday, November 13, 2026

మా నిషాద ప్రతిష్ఠాం త్వమ్ శ్లోక ... పతిపదార్థ భావములు.

 జైశ్రీరామ్.

శ్లో.  మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః |

యత్ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్ ||

ప్రతిపదార్థము:

నిషాద = ఓ బోయవాడా! / వేటగాడా!

యత్ = ఏ కారణం చేతనైతే

కామమోహితమ్ = కామామోహితమైన (సంభోగంలో ఉన్న లేదా ప్రేమలో మునిగి ఉన్న)

క్రౌంచ మిథునాత్ = క్రౌంచ పక్షుల జంట నుండి

ఏకమ్ = ఒకదానిని (మగ పక్షిని)

అవధీః = హతమార్చితివో / చంపితివో

త్వమ్ = నీవు

శాశ్వతీ సమాః = ఎప్పటికీ / అనేక సంవత్సరాల పాటు

ప్రతిష్ఠామ్ = సుఖమైన స్థితిని / నిలకడను (లేదా శాశ్వతమైన కీర్తిని)

మా అగమః = పొందుకోలేకపోదువు గాక! (శాంతి లేకుండా పోవును గాక!)

భావము:

ఓ నిషాదా (వేటగాడా)! కామమోహితమై ఉన్న క్రౌంచ పక్షుల జంటలోని ఒకదానిని నువ్వు చంపినందువల్ల, నీకు కూడా ఎప్పటికీ శాంతి లేకుండా పోవును గాక!

జైహింద్.

No comments: