Thursday, April 2, 2026

లాస్సేంజిల్స్ లో 10 వ సంవత్సరం జరుపుచున్న శ్రీసీరామకల్యాణం. సందర్భంగా నవరత్న మాలిక.

 జైశ్రీరామ్.

శ్రీరస్తు,                             శుభమస్తు.                అవిఘ్నమస్తు.

ఓం శ్రీమాత్రే నమః.

అమెరికా లోని లాస్సేంజిల్స్ సెమీవేలీ లో

వేలీ తెలుఁగు కమ్యూనిటీ వారు నిర్వహించుచున్న10వ సంవత్సారములుగా జరిపించుచున్న

శ్రీ సీతారామకల్యాణ మహోత్సవము.

పంచరత్నమాలిక.

రచన.    కవికల్పభూజ చింతా రామకృష్ణారావు. M.A.,


1. శా. శ్రీమన్మంగళ శాంభవీ! కనుమ, లాసేంజిల్సు పట్ణంబునన్ 

శ్రీమంతంబుగ వెల్గుచున్న శుభ వేలీతెల్గు కమ్యూనిటీ

క్షేమంబున్ వరలింపఁ జేయ భువిపై శ్రీ జానకీ రాములన్

ప్రేమన్ గల్పగ పెండ్లి చేసిరిచటన్ విశ్వంబె యుప్పొంగగన్.


2. మ.  మహనీయుల్, ప్రతిభా విశేష ధిషణుల్ మార్తాండ శర్మాఖ్యు లీ

మహిమోపేత శుభప్రదంబయిన సమ్మాన్యంపు కల్యాణమున్

రహియింపన్ జగమంతయున్ వెలుగగా ప్రఖ్యాతిగాఁ జేసి రీ

సహనోద్భాసితు నేలుమా రఘువరా! సంస్తుత్యమార్గంబునన్.


3. చం.  కొడిదల రామ్ శిరీషలునకుంఠితరీతిని సీతపెండ్లికై

వడివడి కర్యమగ్నులవ, భాసిలు చందును భార్యయున్ పనుల్

మడిగ నొనర్చుచుండగ, కుమారు లతల్  సహకారమీయఁగా

తడయక నిల్చు యా సుచరితన్ గొని వచ్చె మనోహరుండు తాన్.


4. చం.  నయగుణ బొమ్మకంటి సుజనార్ధను లాతని పత్నిఁగూడి యీ

ప్రియమగు కార్యమందు నొనరించగ పూజ వసించి యుండి రో

జయగుణ వర్ధనా! సుగుణసాంద్ర! జయంబులు కొల్పు రాఘవా!

రయమున వచ్చి పూజలకు రంజిలు భక్తులఁ గాంచి కావుమా.


5. శా.   సీతారాములపెండ్లి చేసిరి శుభశ్రీలొప్ప నిచ్చోట నా

సీతారాముల సత్కృపాజలధిలో జేగీయమానంబుగా

ఖ్యాతిన్ గాంచుచు వెల్గుచుండుత మహద్గణ్యంబుగా వేలిలో

నీ తెల్గున్ వరలించు దండు, గొనుతన్ నిత్యంబు మాంగళ్యమున్.


మంగళమ్.... మహత్ ... శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.
















No comments: