ఓం నమో నారాయణాయ.🙏🏽
సాహిత్ శతావధానమున సమస్య 6. ప్రాశ్నికులు చింతా రామకృష్ణారావు.
ఇచ్చిన సమస్య.
👇🏾
* విద్యాశంకర భారతీ యతివరుల్వీక్షింత్రు పాపాత్ములన్.*
శ్రీ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అవధాని పూరణ.
👇🏾
శా. సద్యోగమ్మును బొంది యే జనులు తత్ సాన్నిధ్యమాశింతురో
విద్యాగంధము లేనివారయిన సద్విద్వాంసులే యైన సం
పద్యోగమును గల్గఁ జేసి యనుకంపాపూర్ణులై పెక్కుగా
* విద్యాశంకర భారతీ యతివరుల్వీక్షింత్రు పాపాత్ములన్.*
నా పూరణ.
👇🏾
శా. విద్యావంతులు భారతీయతివరున్ వీక్షింపగా వత్రు, స
ద్విద్యాదూరులు పాపకార్యరతులై వేదాత్మునిన్ గాంచమిన్
సద్యోగమ్మును గాంచ లేరనుచు తత్ సద్యోగమున్ గొల్పగా
* విద్యాశంకర భారతీ యతివరుల్వీక్షింత్రు పాపాత్ములన్.*
🙏🏽🙏🏽🙏🏽
No comments:
Post a Comment