జైశ్రీరామ్.
73) పెద్దవారి
నడుమ పిల్లలమగు మేము - చెప్పు మాట వినరు. తప్పనుదురు.
మమ్ము చెప్పనిండు. మా మాటవినుఁడయ్య - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాటలాడుకొనుచున్నప్పుడు మేము ఆ మాటలు విని స్పందించి మా
అభిప్రాయమును చెప్పుటకు ఉత్సహిస్తున్నప్పుడు మమ్మల్ని మీరు అడ్డుకొని, అలా మధ్యలో మాటాడ కూడదు, తప్పు అని మా నోరు
నొక్కివేతురు. మమ్మల్ని కూడా మా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి.
మా మాట కూడా కొంచెం వినండి..
జైహింద్.
No comments:
Post a Comment