Thursday, December 7, 2017

బాల భావన. 60వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

                                                                  జైశ్రీరామ్.
60) మనసులోని మాట వినిపించ యత్నింప    -  తిరగబడితిమనుచు తిట్టెదరుగ!
     మనసు విప్పి మేము మాటాడ కూడదా?   -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! సందర్భానుసారముగా పెద్దలతో మా మనసులో ఉన్న మాట మేము చెప్పుటకు ప్రయత్నము చేస్తుంటాము. ఐతే వారి మాటకు ఎదురు చెప్పుతున్నామని వారిపై తిరుగుబాటు చేస్తున్నామనీ తిట్టుచుందురు. మేము మనసు విప్పి మీతో మాటాడ కూడదా? మమ్మల్నర్థం చేసుకోరేమి?
జైహింద్.

No comments: