జైశ్రీరామ్.
69) పాఠశాలలోన బలవంత పెట్టుచు - చదువు నేర్ప, మాకు చదువు రాదు.
నిజము చెప్ప మమ్ము నిలఁబెట్టి దండింత్రు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! బడిలో మాకు ఇష్టము లేని సమయమున ఉపాధ్యాయులు బోధింప యత్నించినచో మేము మా మనసులో ఉన్న యీ అభిప్రాయమును చెప్పినచో వారు మమ్ము వారిని ఎదిరిస్తున్నామంటూ నిలపెట్టి దండిస్తారు. ఈ విధముగ చేయుట ధర్మమా?
జైహింద్.
No comments:
Post a Comment