Wednesday, December 13, 2017

బాల భావన. 64వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
64) తల్లి కడుపులోన తన్నితిమానాడు. తల్లి మనసు తెలిసి తల్లడిలుదు
     మిప్పుడేమి చేసి మెప్పింప గలమయ్యపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నితిమి. పుట్టిన తరువాత ఆమె మనసు తెలుసుకొనిన మేము తల్లడిల్లిపోవుచున్నాము. ఇప్పుడు మేము ఆమెకు ఏమి చేసి మెప్పించఁ గలము?
జైహింద్.

No comments: