జైశ్రీరామ్
56) కన్నతండ్రి మనసు కఠినమందురుకాని - వెన్నకన్న మృదువు. కన్న బిడ్డకాన రాని వేళ కలత చెందును తండ్రి. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కన్న తండ్రి యొక్క మనసు కఠినంగా ఉంటుందని అందరూ అందురు. కాని అది సత్యము కాదు. అతని మనసు వెన్నకన్నా సుకుమారమైనది. తమ కన్న బిడ్డ ఎదురుఁగా ఉన్నంత సేపూ అతనిలో ఉన్న ప్రేమ బైటకు చూపరు. తన కన్న బిడ్డ కాస్త కనిపించకపోతే ఊరికే తల్లడిల్లిపోదురు. అంతటి అనురాగ మూర్తి తండ్రి..
జైహింద్
No comments:
Post a Comment