Friday, December 1, 2017

బాల భావన. 55వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

                                                                    జైశ్రీరామ్
55) చెత్తపనులు మేము చేయుట చూచినా   తల్లి చెప్పఁ బోదు తండ్రికెపుడు.
     తండ్రి కన్న తల్లి దయఁ జూచి రక్షించుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నతనము కారణముగా మేము పాడు పనులు చేస్తున్నా కాని తల్లి చూచినప్పటికీ తండ్రికి చెప్పదు. తండ్రి కన్నా తల్లి పిల్లలను దయతో చూచుచు రక్షించుచుండును. అమ్మకు మాపై అంతటి ప్రేమ ఉంటుంది.
  జైహింద్.

No comments: