Wednesday, January 3, 2018

బాల భావన. 74వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

  జైశ్రీరామ్.
74) పిన్నలమగు మేము పెద్దవారిని పోలి   చూడఁ గలము. చూచి చెప్పఁ గలము.
    చూచి చెప్పనిండు తోచిన భావనపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలమైన మేము కూడా పెద్దవారిలాగే వినకలము, దానికి స్పందించి మా అభిప్రాయము కూడా చెప్పఁగలము. మమ్మల్ని కూడా ఏమి జరుగుచున్నదో చూడనివ్వండి, చూచి చెప్పనివ్వండి.
జైహింద్.

No comments: