Sunday, December 17, 2017

బాల భావన. 68వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు

జైశ్రీరామ్.
68) పాఠశాలలోన పదిమందితో పాటు   అచటనున్నవాటినరయుదుమయ.
     మంచి చెడ్డలుండు. మన్నింపవలె మీరుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము బడిలో పదిమందితో కలిసి మసలుచున్నందున అక్కడి విషయములను అందరితో పాటు మేమూ నేర్చుకొందుముఅట్లు నేర్చుకొనువాటిలో మంచివిషయములుండ వచ్చును, వాటితో పాటు చెడ్డ విషయములు కూడా ఉండ వచ్చును. ఆట్టి సమయమందు ఆ చెడ్డ మాలో చోటు చేసుకొన్నదని మీరు గ్రహించినచో మమ్ములను మన్నించి, ఆ చెడును గురించి మాకు చెప్పి, మమ్ములను మంచి మార్గమున మీరు నడిపించ వలెను.
జైహింద్.

No comments: